బళ్లారిలో 'ఆగడు' షూటింగ్ వీడియో లీక్! | mahesh babu aagadu shooting video leaked | Sakshi
Sakshi News home page

బళ్లారిలో 'ఆగడు' షూటింగ్ వీడియో లీక్!

Published Wed, Feb 26 2014 4:55 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

బళ్లారిలో 'ఆగడు' షూటింగ్ వీడియో లీక్!

బళ్లారిలో 'ఆగడు' షూటింగ్ వీడియో లీక్!

శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ హీరోగా రాబోతున్న 'ఆగడు' చిత్రం షూటింగ్కు సంబంధించిన సన్నివేశం ఒకటి లీకైంది. బ్యాక్గ్రౌండులో ఓ గనికి సంబంధించిన బ్లాస్టింగ్ జరుగుతుండగా ఫుల్హ్యాండ్స్ షర్టు మడత పెట్టుకుంటూ మహేష్ నడుచుకుంటూ వస్తున్న సన్నివేశం ఆ వీడియోలో ఉంది. '1.. నేనొక్కడినే' చిత్రం తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఆగడు. 'దూకుడు' సినిమాతో మహేష్కు మంచి విజయాన్ని అందించిన శ్రీను వైట్ల మరోసారి ప్రిన్స్కు భారీ విజయం ఇవ్వడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

ఈ సినిమా ఫస్ట్లుక్ కూడా ఇంతవరకు విడుదల కాలేదు. ఈ చిత్రంలో మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఆయన ఇందులో కనపడతాడని అంటున్నారు. అలాగే, మహేష్- మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ కూడా తొలిసారి వెండితెరపై ఈ చిత్రం ద్వారానే కనపడబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement