
రాంచరణ్ కు జోడీగా సమంత?
హీరో రాంచరణ్ తదుపరి మూవీలో సమంతను హీరోయిన్ ఎంపికచేసినట్లు తెలుస్తోంది.
చెన్నై: హీరో రాంచరణ్ తదుపరి మూవీలో సమంతను హీరోయిన్ గా ఎంపికచేసినట్లు తెలుస్తోంది. రాంచరణ్ గోవిందుడు అందరివాడేలా చిత్రం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్నఈ చిత్రానికి సంబంధించి పేపర్ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలోనే నటీ నటుల కాస్టింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా రాంచరణ్ కు జోడీగా సమంతను పెడితే ఎలా ఉంటుందనేది చర్చకు వచ్చింది. నటి సమంత పేరును దాదాపు ఖరారు చేసినా.. అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
రాంచరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్నతొలి చిత్రంలో రెండో హీరోయిన్ కోసం కూడా ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాంచరణ్ ప్రక్కన సమంత జోడీ కడితే మాత్రం.. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చే తొలి మూవీ కూడా ఇదే అవుతుంది.