
తెరపై తొలి పంచ్
‘ప్రతివోడు... పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్. ఎలపరమొచ్చేస్తంది’... సూపర్‌స్టార్ కృష్
‘ప్రతివోడు... పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్. ఎలపరమొచ్చేస్తంది’... సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శనివారం విడుదలైన ‘ఆగడు’ టీజర్‌లో మహేశ్‌బాబు చెప్పిన పంచ్ డైలాగ్ ఇది. ఈ టీజర్‌ని తిలకించిన కృష్ణ... ఈ చిత్రం కచ్చితంగా ‘దూకుడు’ని మించిన విజయం సాధిస్తుందన్నారు. దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ -‘‘ఇందులో మహేశ్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది.
మహేశ్ సినిమాల్లో నంబర్‌వన్ సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. శనివారం విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వస్తోందని, సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు. ఈ నెల 5 నుంచి 21 వరకూ ముంబయ్ షెడ్యూల్ ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత కోటి పరుచూరి చెప్పారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, సంగీతం: తమన్, కెమెరా: కె.వి.గుహన్.