![Vishnu Manchu Confirms A Project With Srinu Vaitla - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/4/Srinu%20Vaitla.jpg.webp?itok=daRGTeB3)
కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్లతో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల తరువాత వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు. ఆగడు నుంచి మొదలైన శ్రీనువైట్ల ఫ్లాప్‌ల పరంపర అమర్ అక్బర్ ఆంటొని వరకు సాగింది. దీంతో శ్రీనువైట్లకు చాన్స్ ఇచ్చే హీరోలే కరువయ్యారు. ఇంకా ఈ దర్శకుడి కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో మరో చాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు మంచు విష్ణు.
శ్రీనువైట్ల, మంచు విష్ణు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. తాజాగా విష్ణు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. 12 ఏళ్ల తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించబోతున్నట్టుగా వెల్లడించారు. అయితే ఈ సినిమా వీరి కాంబినేషన్‌లో సూపర్ హిట్ అయిన ఢీ మూవీకి సీక్వల్ అన్న ప్రచారం జరుగుతున్నా విష్ణు మాత్రం సీక్వల్ అన్న విషయం ప్రకటించలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment