
దర్శకుడు శ్రీను వైట్లపై కేసు నమోదు
బ్రూస్లీ, ఆగడు లాంటి సినిమాలతో ఇటీవలి కాలంలో పరాజయాల బాటలో నడుస్తున్న దర్శకుడు శ్రీను వైట్లకు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య సంతోషి రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
బ్రూస్లీ, ఆగడు లాంటి సినిమాలతో ఇటీవలి కాలంలో పరాజయాల బాటలో నడుస్తున్న దర్శకుడు శ్రీను వైట్లకు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య సంతోషి రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శ్రీను వైట్లపై సెక్షన్ 488ఏ, 323ఐపీసీ ప్రకారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పెళ్లయిన 12 ఏళ్ల నుంచి తనను శ్రీను వైట్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని సంతోషిరూప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
తన భర్త తనతో పాటు తన బంధువులు, స్నేహితులను సైతం వేధిస్తున్నారని శ్రీనువైట్ల భార్య పోలీసులకు తెలిపారు. అక్టోబర్ 12వ తేదీన పిల్లలు, పనిమనుషుల ఎదుటనే తనను దర్శకుడు శ్రీనువైట్ల కొట్టాడని ఆన భార్య చెబుతోంది. 13వ తేదీన కూడా మరోసారి ఇలాగే ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్‌లు పగలగొట్టడంతో పాటు తన తల్లిదండ్రులను సైతం అసభ్య పదజాలంతో దూషించారని సంతోషి రూప ఫిర్యాదు తెలిపింది. దీంతో ఉద్దేశపూర్వకంగా కొట్టడం అనే నేరం కింద కేసు నమోదు చేశారు.