
సాక్షి, హైదరాబాద్: దూకుడు, కింగ్, వెంకీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల తన సినిమాలో కామెడీకి ప్రాధాన్యతనిస్తూ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకడుగా ఎదిగాడు. ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడినా శ్రీను వైట్ల మళ్లీ తన దూకుడును పెంచేందుకు రడీ అవుతున్నాడు. జయాపజయాలు ఉన్నప్పటికీ కెరీర్ తృప్తిగా ఉందంటున్న శ్రీను వైట్ల త్వరలోనే మూడు సినిమాల కథలు తన వద్ద సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాడు.
వినోదాత్మక కథలకే నా ప్రయారిటీ అంటున్నాడు శ్రీను వైట్ల. రానున్న మూడు సినిమాల్లో భాగంగా డీ అంటే డీ తోపాటు మరో మల్టీ స్టారర్‌ని తీసుకురానున్నాడట. అలాగే కొత్తవారిని పరిచయం చేస్తూ, మరో చిన్న బడ్జెట్ చిత్రం చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడట..ఈ రోజు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్బంగా స్పెషల్ స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment