ఊహించని దారిలో... | Anirudh to compose music for Pawan Kalyan's next film | Sakshi
Sakshi News home page

ఊహించని దారిలో...

Published Tue, Oct 18 2016 11:20 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఊహించని దారిలో... - Sakshi

ఊహించని దారిలో...

పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ‘వై దిస్ కొలవెరి డీ..’ ఫేమ్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ‘జల్సా’తో ప్రేక్షకుల్ని ఫుల్ ఖుషీ చేసిన పవన్, త్రివిక్రమ్‌లు.. ‘అత్తారింటికి దారేది’తో భారీ విజయంతో పాటు భారీ వసూళ్లు సాధించారు. ఈ రెండూ సగటు తెలుగు చిత్రాల తరహాలోనే ఉంటాయి. ఈసారి మాత్రం సరికొత్త దారిలో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారట. రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా ప్రేక్షకులకు కొత్త చిత్రం అందించాలనుకుంటున్నారట.

అటు పవన్.. ఇటు త్రివిక్రమ్.. ఈ చిత్రం గురించి మాట్లడడం లేదు. సంగీత దర్శకుడు అనిరుధ్ మాత్రం కన్ఫర్మ్ చేసేశారు. ‘‘త్రివిక్రమ్ ‘అఆ’కి సంగీతం అందించే చాన్స్ నాకే వచ్చింది. మిస్ చేసుకున్నా. పవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందబోయే తాజా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతున్నా. ఎవరూ ఊహించనంత కొత్తగా ఉంటుందీ సినిమా’’ అని అనిరుధ్ చెప్పారు. ఈ చిత్రానికి ‘దేవుడే దిగి వచ్చినా’ టైటిల్ పరిశీలనలో ఉందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement