anirudh ravichandran
-
#Devara : ఎన్టీఆర్ 'దేవర'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. ఇదే విషయం ఆమెకు చెప్తే..: విజయ్ సేతుపతి
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం జవాన్. ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ దర్శకుడు అట్లీ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయకిగా నటించగా విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు నటి దీపికా పడుకొనే అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న జవాన్ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: kushi Twitter Review: ‘ఖుషి’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా జవాన్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రాన్ని ఎనిమిది నెలలు పూర్తి చేయాలని ప్రణాళికను సిద్ధం చేశామని అయితే కరోనా తదితర కారణాల వల్ల మూడేళ్లు పట్టిందని చెప్పారు. అదే సమయంలో చిత్రం మరింత బ్రహ్మాండంగా రూపొందిందని, ఖర్చు కూడా భారీగా పెరిగిందన్నారు. అందుకు షారుక్ ఖాన్ ఎంతగానో సహకరించారని అట్లీ చెప్పారు. షారుక్ ఖాన్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. తాను పాఠశాలలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని అయితే అది వన్ సైడ్ లవ్ అని చెప్పారు. ఆ అమ్మాయి మాత్రం తాను నటుడు షారుక్ ఖాన్ వీరాభిమానినని ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందన్నారు. అప్పటినుంచి తనకు షారుక్ ఖాన్‌పై పగ ఏర్పడిందన్నారు. ఆ పగను ఈ చిత్రంలో తీర్చుకున్నానని సరదాగా అన్నారు. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) షారుక్ ఖాన్ మాట్లాడుతూ నటుడు విజయ్ సేతుపతి ఇంతకు ముందు చెప్పినట్లుగా తనపై ప్రతీకారం తీర్చుకోలేరని కారణం ఆయన తనకు అభిమాని అని పేర్కొన్నారు. జవాన్ చిత్రంలో నటించడంతో దక్షిణాది సినిమా గురించి చాలా నేర్చుకున్నానని షారుక్ ఖాన్ చెప్పారు. కాగా చైన్నెలో జవాన్ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొనడానికి వచ్చిన షారుక్ ఖాన్‌కు నటుడు కమలహాసన్ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
టాలీవుడ్‌కి స్వరాలందిస్తున్న పరభాష సంగీత దర్శకులు!
తెలుగు తెరపై పరభాషా తారలు చాలామంది కనిపిస్తుంటారు. తెరవెనక పరభాషా సాంకేతిక నిపుణులు పని చేస్తుంటారు. ముఖ్యంగా పలువురు పరభాషా సంగీతదర్శకులు టాలీవుడ్‌కి ట్యూన్ అయ్యారు. ఈ ఏడాది తెలుగు చిత్రాలకు ఎక్కువగా ఇతర భాషల సంగీతదర్శకులు ట్యూన్లు ఇస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం. ‘కేజీఎఫ్ 1, 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు రవి బస్రూర్ (కన్నడ). ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ చిత్రానికి, అలాగే సీనియర్ నటుడు హరనాథ్ సోదరుడు, నటుడు వెంకట సుబ్బరాజ్ తనయుడు హీరోగా పరిచయమవుతున్న ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రానికి కూడా రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు. ∙గతంలో ‘బిల్లా రంగా, గురు’ ఇటీవల ‘దసరా’ చిత్రాలకు సంగీతం అందించారు సంతోష్ నారాయణన్ (తమిళ్). ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’కి, వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో ప్రారంభమైన ‘సైంధవ్’ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హీరోగా, సంగీత దర్శకునిగా కొనసాగుతున్న జీవీ ప్రకాశ్‌కుమార్ (తమిళ్) ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’కి, నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రానికి స్వరాలందిస్తున్నారు. మాతృభాష మలయాళంలో ‘నోట్ బుక్’ (2006) ద్వారా సంగీతదర్శకుడిగా కెరీర్ ఆరంభించిన గోపీసుందర్ ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు’ (2015) చిత్రంతో తెలుగుకి వచ్చారు. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘మజ్ను’, ‘ప్రేమమ్’, ‘గీత గోవిందం’, ‘మజిలీ’ తదితర చిత్రాలకు స్వరాలందించారు. ఇటీవల రిలీజైన ‘18 పేజెస్’, ‘బుట్ట బొమ్మ’ చిత్రాలకు గోపీయే సంగీతదర్శకుడు. ∙‘అజ్ఞాతవాసి’ (2018), నాని ‘గ్యాంగ్‌లీడర్’ (2019) వంటి చిత్రాలకు తనదైన శైలిలో సంగీతం అందించారు అనిరుధ్ రవిచంద్రన్. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి స్వరాలందిస్తున్నారు. ‘జర్నీ’ (2011), ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ (2013), ‘సిటిజన్’ (2013) వంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌కి పరిచయమైన సి.సత్య (తమిళ్) ప్రస్తుతం స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్నారు. పవన్ కల్యాణ్– సాయిధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సత్యనే స్వరకర్త. తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలకూ తనదైన శైలిలో సంగీతం అందిస్తున్నారు హారీస్ జయరాజ్ (తమిళ్). ప్రస్తుతం ఆయన నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి, నాగశౌర్య కథానాయకుడుగా చేస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ∙‘కిరాక్ పార్టీ’ (2018) చిత్రంతో తెలుగులోకి సంగీత దర్శకునిగా ఎంట్రీ ఇచ్చారు అజనీష్ లోక్‌నాథ్ (కన్నడ). ఆ తర్వాత ‘నన్ను దోచుకుందువటే’ (2018) మూవీకి స్వరాలు అందించారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన తెలుగులో చేస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ‘ఖుషి’ సినిమాతో తెలుగుకి వస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అలాగే నాని హీరోగా సౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి, శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న చిత్రానికి హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలను 1980ల నుంచి తెలుగు శ్రోతలు వింటున్నారు. తెలుగు పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఇళయరాజాది. ఇటీవల విడుదలైన ‘రంగ మార్తాండ’కు ఆయనే స్వరకర్త. అలాగే త్వరలో విడుదల కానున్న ‘మ్యూజిక్ స్కూల్’కి కూడా స్వరాలందించారు. ఇక ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా టాలీవుడ్ కెరీర్ ‘శేషు’ (2002) సినిమాతో ప్రారంభమై, కొనసాగుతోంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కస్టడీ’ చిత్రానికి తండ్రి ఇళయరాజాతో కలిసి స్వరాలు అందించారు యువన్. అలాగే శర్వానంద్ హీరోగా చేయనున్న ఓ చిత్రానికి యువన్ శంకర్ స్వరాలందిస్తున్నారు. వీరే కాదు.. మరికొందరు ఇతర భాషల సంగీత దర్శకులు తెలుగు చిత్రాలకు ట్యూన్లు ఇస్తున్నారు. -
అఫీషియల్: రజనీకాంత్ 170 చిత్రం అప్డేట్, ఆ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌తో..
ఫలితాలతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 70 ఏళ్లలో కూడా యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆయన నెక్ట్స్ తన కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న లాల్ సలామ్‌లో ఆయన గెస్ట్ రోల్ చేయబోతున్నారు. మార్చి 7న సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే బ్యానర్ నుంచి తలైవా 170వ చిత్రం రాబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రోజు(మార్చి 2న) లైకా సంస్థ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ సుభాకరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తలైవా ఫ్యన్స్కి లైకా ప్రొడక్షన్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. తలైవా 170వ చిత్రాన్ని తమ బ్యానర్లోనే నిర్మించబోతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా ఇదే బ్యానర్లో రజనీ రోబో 2.0, దర్భార్ చిత్రాలు రూపొందాయి. ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 సినిమా తెరకెక్కిబోతుంది. గతంలో ఆయన సూర్య జై భీమ్‌తో సంచలన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో రజనీ 170 చిత్రాన్ని ఆయన ఏ రేంజ్లో ప్లాన్ చేశారనేది ఆసక్తిని సంతరించుకుంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. We are feeling honoured to announce our next association with “Superstar” @rajinikanth 🌟 for #Thalaivar170 🤗 Directed by critically acclaimed @tjgnan 🎬 Music by the sensational “Rockstar” @anirudhofficial 🎸 🤝 @gkmtamilkumaran 🪙 @LycaProductions #Subaskaran#தலைவர்170 🤗 pic.twitter.com/DYg3aSeAi5 — Lyca Productions (@LycaProductions) March 2, 2023 -
‘తప్పు తీర్పు ఇచ్చానని ఏ జడ్జీ ఒప్పుకోడు’
న్యూఢిల్లీ: ఏ న్యాయమూర్తి తాను తప్పు తీర్పు ఇచ్చానని ఒప్పుకోరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా, కేవలం తప్పుడు ఆదేశాలు ఇచ్చారన్న కారణంతో జడ్జీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేమంది. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత పవిత్రమైంది.తప్పు చేసినట్లు, అవినీతికి పాల్పడినట్లు, ప్రలోభాలకు గురైనట్లు స్పష్టమైన ఆరోపణలుంటే తప్ప.. తప్పు తీర్పు ఇచ్చారన్న ఒకే కారణంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించరాదు’ అని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించడంపై బిహార్‌కు చెందిన ఒక న్యాయాధికారి దాఖలు చేసి పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పటికే హైకోర్టు బెయిల్‌ను నిరాకరించిన విషయాన్ని గుర్తించకుండా.. హత్యారోపణలు ఎదుర్కొంటున్న కొందరికి బెయిల్ మంజూరు చేయడంపై, మరో డ్రగ్ సంబంధిత కేసు విచారణను హడావుడిగా ముగించడంపై ఆ న్యాయాధికారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది హిందూ నిర్మాణమే! : అయోధ్య వివాదాస్పద స్థలంలో పురాతత్వ శాఖ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో వెల్లడైన విషయాలు ఆ స్థలం తమదేనన్న ముస్లింల వాదనను స్పష్టంగా తోసిపుచ్చుతున్నాయని రామ్ లల్లా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. అయోధ్య వివాదాస్పద స్థల యాజమాన్య వ్యాజ్యంపై జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు గురువారం వాదనలు కొనసాగాయి. -
వేసవికి వస్తున్నాం
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘బిగిల్’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు తమిళ హీరో విజయ్. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామి. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. సంతోష్ శివన్ ఛాయాగ్రహకుడు. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌లో మొదలు కానుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. అజిత్ 60వ చిత్రం కూడా వచ్చే ఏడాది సమ్మర్లోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోద్. -
సూపర్ స్టార్ ‘దర్బార్’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల పేటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రజనీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దర్బార్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. టైటిల్ లోగోతో పాటు సినిమాలో రజనీ లుక్‌ను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ మూవీ 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.స్వరాలందించనున్నాడు. -
బాసూ.. మళ్లీ మాసు
‘పేట’లో రజనీకాంత్ మేనరిజమ్‌కు తగ్గట్లు కేవ్వు కేక అనిపించే పాటలు అందించారు సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచంద్రన్. ఆ సినిమాలో ‘మరణమ్ మాసు మరణమ్..’ పాట సూపర్ హిట్. ఇప్పుడు రజనీ కోసం అనిరుథ్ మళ్లీ ఇలాంటి మాస్ పాటలివ్వడానికి రెడీ అయ్యారు. ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుథ్ని సంగీతదర్శకుడిగా తీసుకున్నారు. బాసుకి మళ్లీ మాస్ పాటలివ్వాలంటూ తన టీమ్‌తో పని మొదలుపెట్టారట అనిరుథ్. ఇలా బ్యాక్ టు బ్యాక్ రజనీకాంత్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చే చాన్స్ కొట్టేసినందుకు అనిరుథ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ 90 రోజులు కాల్షీట్స్ను కేటాయించారని కోలీవుడ్ టాక్. ఇందులో రజనీకాంత్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నారని, కథానాయికల పాత్ర కోసం టీమ్... నయనతార, కీర్తీసురేష్ లను సంప్రదించారని సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. గతంలో రజనీకాంత్ సరసన కీర్తీ సురేష్ తల్లి మేనక కథానాయికగా నటించారు. ఇప్పుడు కూతురు జోడీగా నటించనుండటం విశేషం. -
ఇండియన్ 2కి అనిరుద్ స్వరాలు
కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘనవిజయం అందుకుందో తెలిసిందే. ఆ సినిమా విడుదలైన 21 ఏళ్లకు ‘ఇండియన్ 2’కి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి ‘కొలవెరి’ ఫేమ్ అనిరుద్ రవిచంద్రన్ స్వరాలు అందించనున్నారని కోలీవుడ్ టాక్. శంకర్ సినిమా అంటే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారనుకోవడం కామన్. ఇప్పటివరకూ శంకర్ తీసిన చిత్రాల్లో ‘అపరిచితుడు, నన్బన్’ మినహా మిగిలిన చిత్రాలన్నింటికీ రెహమానే స్వరకర్త. ‘ఇండియన్ 2’కి అనిరుద్ ఎంటర్ అవ్వడం హాట్ న్యూస్ అయింది. కమల్ హాసన్ ‘బిగ్ బాస్ 2’ పూర్తవగానే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందట. -
మిలటరీ కాదు... ఫ్యామిలీ కథే!
హృదయాలను హత్తుకునే అనుబంధాల హరివిల్లులకు, నవ్వులకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో లోటుండదు. కానీ, ఎన్టీఆర్‌తో తీయబోయే సిన్మాతో త్రివిక్రమ్ రూటు మార్చబోతున్నారనే వార్తలొచ్చాయి. మిలటరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నారు. తాజా ఖబర్ ఏంటంటే... రెగ్యులర్‌గా వెళ్లే రూటులోనే, తనకు బాగా అలవాటైన దారిలోనే ఎన్టీఆర్‌తో కలసి త్రివిక్రమ్ జర్నీ చేయబోతున్నారట! అంటే... ఎన్టీఆర్‌తో తీయబోయేది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది ఫిక్స్. యాక్చువల్లీ... ఎన్టీఆర్–త్రివిక్రమ్ డిస్కషన్స్ టైమ్‌లో మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథనూ అనుకున్న మాట నిజమే. అయితే... ప్రస్తుతం ఫ్యామిలీ నేపథ్యంలోని కథతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారని ఫిల్మ్‌నగర్ టాక్! హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఫిబ్రవరిలో ప్రారంభిస్తారని సమాచారమ్. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ స్వరకర్త. -
ఊహించని దారిలో...
పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ‘వై దిస్ కొలవెరి డీ..’ ఫేమ్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ‘జల్సా’తో ప్రేక్షకుల్ని ఫుల్ ఖుషీ చేసిన పవన్, త్రివిక్రమ్‌లు.. ‘అత్తారింటికి దారేది’తో భారీ విజయంతో పాటు భారీ వసూళ్లు సాధించారు. ఈ రెండూ సగటు తెలుగు చిత్రాల తరహాలోనే ఉంటాయి. ఈసారి మాత్రం సరికొత్త దారిలో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారట. రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా ప్రేక్షకులకు కొత్త చిత్రం అందించాలనుకుంటున్నారట. అటు పవన్.. ఇటు త్రివిక్రమ్.. ఈ చిత్రం గురించి మాట్లడడం లేదు. సంగీత దర్శకుడు అనిరుధ్ మాత్రం కన్ఫర్మ్ చేసేశారు. ‘‘త్రివిక్రమ్ ‘అఆ’కి సంగీతం అందించే చాన్స్ నాకే వచ్చింది. మిస్ చేసుకున్నా. పవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందబోయే తాజా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతున్నా. ఎవరూ ఊహించనంత కొత్తగా ఉంటుందీ సినిమా’’ అని అనిరుధ్ చెప్పారు. ఈ చిత్రానికి ‘దేవుడే దిగి వచ్చినా’ టైటిల్ పరిశీలనలో ఉందట. -
ఎట్టకేలకు పోలీసుల ముందుకు బీప్ సాంగ్ అనిరుధ్
'బీప్ సాంగ్' వివాదంలో ఇరుక్కున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పోలీసుల వద్ద హాజరయ్యాడు. నటుడు శింబుతో ఈ పాట పాడించి ఒక్కసారిగా వివాదాలు మూటగట్టుకున్న అనిరుధ్.. ఇన్నాళ్లుగా విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రేస్ కోర్స్ రోడ్డు పోలీసు స్టేషన్ వద్ద హాజరైన అనిరుధ్.. రెండు పేజీల ప్రకటన సమర్పించాడు. ఆ పాటను తాను కంపోజ్ చేయలేదనే మరో సారి చెప్పాడు. కోయంబత్తూరులో పోలీసుల వద్ద హాజరై తన ప్రకటన ఇచ్చానని వాట్సప్ మెసేజి ద్వారా మీడియాకు చెప్పాడు. ఆలిండియా డెమొక్రాటిక్ ఉమెన్ అసోసియేషన్ (ఐద్వా) వాళ్లు ఈ పాట విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పాటలో మహిళలను కించపరిచేలా అసభ్య లిరిక్స్ ఉన్నాయని ఐద్వా మండిపడిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి శింబు, అనిరుధ్ ఇద్దరినీ డిసెంబర్ 19న హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే శింబు వాళ్లను నెల రోజుల గడువు కోరాడు. అనిరుధ్ మాత్రం తాను ఆ పాటను కంపోజ్ చేయలేదని, అందవల్ల తనపై ఎఫ్ఐఆర్ ఎత్తేయాలని అడిగాడు. పోలీసులు దాన్ని నిరాకరించి, జనవరి 2న హాజరు కావాలన్నారు. అప్పుడు మళ్లీ అనిరుధ్ 15 రోజుల గడువు కోరాడు. తాను చెన్నై వరద బాధితుల సహాయార్థం విదేశాల్లో ప్రదర్శనలు చేస్తున్నానని, వచ్చాక హాజరవుతానని చెప్పాడు.