బాసూ.. మళ్లీ మాసు | Anirudh again teams up with Rajinikanth for AR Murugadoss film | Sakshi
Sakshi News home page

బాసూ.. మళ్లీ మాసు

Published Fri, Mar 1 2019 1:00 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Anirudh again teams up with Rajinikanth for AR Murugadoss film - Sakshi

రజనీకాంత్‌

‘పేట’లో రజనీకాంత్‌ మేనరిజమ్‌కు తగ్గట్లు కేవ్వు కేక అనిపించే పాటలు అందించారు సంగీత దర్శకుడు అనిరుథ్‌ రవిచంద్రన్‌. ఆ సినిమాలో ‘మరణమ్‌ మాసు మరణమ్‌..’ పాట సూపర్‌ హిట్‌. ఇప్పుడు రజనీ కోసం అనిరుథ్‌ మళ్లీ ఇలాంటి మాస్‌ పాటలివ్వడానికి రెడీ అయ్యారు. ఏఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుథ్‌ని సంగీతదర్శకుడిగా తీసుకున్నారు. బాసుకి మళ్లీ మాస్‌ పాటలివ్వాలంటూ తన టీమ్‌తో పని మొదలుపెట్టారట అనిరుథ్‌.

ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ రజనీకాంత్‌ సినిమాకు మ్యూజిక్‌ ఇచ్చే చాన్స్‌ కొట్టేసినందుకు అనిరుథ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం రజనీకాంత్‌ 90 రోజులు కాల్షీట్స్‌ను కేటాయించారని కోలీవుడ్‌ టాక్‌. ఇందులో రజనీకాంత్‌ డ్యూయెల్‌ రోల్‌ చేయబోతున్నారని, కథానాయికల పాత్ర కోసం టీమ్‌... నయనతార, కీర్తీసురేష్‌ లను సంప్రదించారని సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఇదిలా ఉంటే.. గతంలో రజనీకాంత్‌ సరసన కీర్తీ సురేష్‌ తల్లి మేనక కథానాయికగా నటించారు. ఇప్పుడు కూతురు జోడీగా నటించనుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement