మిలటరీ కాదు... ఫ్యామిలీ కథే! | Anirudh Ravichander Upcoming Telugu Film | Jr Ntr | Trivikram | Sakshi
Sakshi News home page

మిలటరీ కాదు... ఫ్యామిలీ కథే!

Published Sun, Oct 22 2017 12:33 AM | Last Updated on Sun, Oct 22 2017 3:47 AM

Anirudh Ravichander Upcoming Telugu Film | Jr Ntr | Trivikram

హృదయాలను హత్తుకునే అనుబంధాల హరివిల్లులకు, నవ్వులకు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాల్లో లోటుండదు. కానీ, ఎన్టీఆర్‌తో తీయబోయే సిన్మాతో త్రివిక్రమ్‌ రూటు మార్చబోతున్నారనే వార్తలొచ్చాయి. మిలటరీ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నారు. తాజా ఖబర్‌ ఏంటంటే... రెగ్యులర్‌గా వెళ్లే రూటులోనే, తనకు బాగా అలవాటైన దారిలోనే ఎన్టీఆర్‌తో కలసి త్రివిక్రమ్‌ జర్నీ చేయబోతున్నారట! అంటే... ఎన్టీఆర్‌తో తీయబోయేది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనేది ఫిక్స్‌.

యాక్చువల్లీ... ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ డిస్కషన్స్‌ టైమ్‌లో మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథనూ అనుకున్న మాట నిజమే. అయితే... ప్రస్తుతం ఫ్యామిలీ నేపథ్యంలోని కథతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌! హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఫిబ్రవరిలో ప్రారంభిస్తారని సమాచారమ్‌. ఈ చిత్రానికి అనిరుద్‌ రవిచంద్రన్‌ స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement