ఇండియన్ స్క్రీన్‌పై వండర్ | wonder on indian screen | Sakshi
Sakshi News home page

ఇండియన్ స్క్రీన్‌పై వండర్

Oct 1 2013 2:14 AM | Updated on Aug 28 2018 4:30 PM

ఇండియన్ స్క్రీన్‌పై వండర్ - Sakshi

ఇండియన్ స్క్రీన్‌పై వండర్

అది భూమండలమా, లేక వేరే ఏదైనా గ్రహమా? తెరపై కనిపిస్తున్నది మనుషులా, గ్రహాంతర వాసులా? అసలు ఏ కాలం జరిగే కథ ఇది? ‘వర్ణ’ ట్రైలర్ చూస్తే... ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతాయి. పేరుకు తగ్గట్టే సప్తవర్ణ శోభితంగా ఉంది ట్రైలర్.

అది భూమండలమా, లేక వేరే ఏదైనా గ్రహమా? తెరపై కనిపిస్తున్నది మనుషులా, గ్రహాంతర వాసులా? అసలు ఏ కాలం జరిగే కథ ఇది? ‘వర్ణ’ ట్రైలర్ చూస్తే... ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతాయి. పేరుకు తగ్గట్టే సప్తవర్ణ శోభితంగా ఉంది ట్రైలర్. 7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే లాంటి ప్రేమకథలతో పాటు ‘యుగానికొక్కడు’ లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన సెల్వరాఘవన్ తీర్చిదిద్దిన మరో విభిన్న కథా చిత్రమిది. 
 
 అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఆర్య ముఖ్య పాత్ర పోషించారు. తమిళంలో ‘ఇరండామ్ ఉలగమ్’ పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం పాటలు ఇప్పటికే తమిళ నాట విజయఢంకా మోగిస్తుండటం గమనార్హం. ఈ సినిమా తెలుగు వెర్షన్ అయిన ‘వర్ణ’ పాటలను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తెలిపారు. ఇంకా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ -‘‘ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాని కథాంశమిది. 
 
 అత్యంత భారీ వ్యయంతో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హేరిస్ జైరాజ్ పాటలు, అనిరుధ్ నేపథ్య సంగీతం, కోలా భాస్కర్ కూర్పు, రామ్‌జీ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘హాలీవుడ్ సినిమాలకు రీరికార్డింగ్ అందించిన బుడాపెస్ట్‌లో గల  స్టూడియోలో ఈ సినిమా రీరికార్డింగ్ వర్క్ జరుగుతోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి’’ అని సెల్వరాఘవన్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement