‘కొలవెరి’అనిరుథ్ యాక్టింగ్..! | Anirudh to do a cameo in Aakko | Sakshi
Sakshi News home page

‘కొలవెరి’అనిరుథ్ యాక్టింగ్..!

Published Fri, Jan 3 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

‘కొలవెరి’అనిరుథ్ యాక్టింగ్..!

‘కొలవెరి’అనిరుథ్ యాక్టింగ్..!

‘3’ చిత్రానికి అనిరుథ్ స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి...’ పాట జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యింది. ఆ పాట తర్వాత కొలీవుడ్‌లో చాలామంది అనిరుథ్‌ని ‘కొలవెరి బోయ్’ అని పిలుస్తున్నారు. సంగీతదర్శకునిగా బిజీగా ఉన్న ఈ కొలవెరి బోయ్ వెండితెరపై కనిపించబోతున్నారు. ‘ఆక్కో’ అనే చిత్రంలో అతిథి పాత్ర చేస్తున్నారాయన. వాస్తవానికి ఈ చిత్రంలో హీరోగా నటించమని అనిరుథ్‌ని దర్శకుడు శ్యామ్ అడిగారట. అయితే, లీడ్ రోల్స్ చేయడానికి సుముఖంగా  లేకపోవడంతో అనిరుథ్ ఈ ఆఫర్‌ని తిరస్కరించారు. కానీ, కథ నచ్చడంతో గెస్ట్ రోల్ చేయడానికి సమ్మతించారు. అలాగే, ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార గీతంలో కూడా కనిపించడంతో పాటు, అన్ని పాటలకూ స్వరాలు అందిస్తున్నారు అనిరుథ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement