
అనిరుథ్.. పదేళ్ల కెరీర్ లో 25 చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. వీటిల్లో మూడు తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి. అజ్ఞాతవాసి ,జెర్సీ,గ్యాంగ్ లీడర్ ఈ మూడు తెలుగు చిత్రాలకు అనిరుథ్ వర్క్ చేశాడు. ఆ తర్వాత మాత్రం పూర్తిగా కోలీవుడ్ కు షిప్ట్ అయ్యాడు. అయితే అనిరుథ్ అక్కడ ట్యూన్ కడితే ఇక్కడ ఫ్యాన్స్ కాలు కదుపుతున్నారు. అతని బీట్స్ టాలీవుడ్ గల్లీలో సైతం రీసౌండ్ చేస్తున్నాయి.అందుకే టీటౌన్ నుంచి అనిరుథ్ కు ఆఫర్స్ వెళ్తున్నాయి.
టాలీవుడ్ కు తిరిగి తీసుకువచ్చేందుకు మన దర్శకులు అతనితో చర్చలు జరుపుతున్నారు. కొరటాల శివ మేకింగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడని టాలీవుడ్ లో కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అది నిజం కావాలని టాలీవుడ్ అనిరుథ్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించే చిత్రానికి కూడా అనినే మ్యూజిక్ అందించబోతున్నాడట.మొత్తంగా బాబాయ్, అబ్బాయ్ సినిమాలకు అనిరుథ్ సంగీతం అందిస్తే నందమూరి అభిమానులకు అంతకంటే ఏంకావాలి.
Comments
Please login to add a commentAdd a comment