కిరాక్ లవ్‌స్టోరి | upcoming movie kirrak love story | Sakshi
Sakshi News home page

కిరాక్ లవ్‌స్టోరి

Feb 22 2014 11:30 PM | Updated on Sep 18 2018 8:13 PM

కిరాక్  లవ్‌స్టోరి - Sakshi

కిరాక్ లవ్‌స్టోరి

అనిరుద్ధ్, చాందిని జంటగా రూపొందుతోన్న చిత్రం ‘కిరాక్ లవ్‌స్టోరి’. హరీక్ దేవభక్తుని దర్శకుడు. గంగపట్నం శ్రీధర్ నిర్మాత.

 అనిరుద్ధ్,చాందిని జంటగా రూపొందుతోన్న చిత్రం ‘కిరాక్ లవ్‌స్టోరీ’. హరీక్ దేవభక్తుని దర్శకుడు. గంగపట్నం శ్రీధర్ నిర్మాత. 80శాతం టాకీతో పాటు ఓ పాట చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ -‘‘ఎన్నో రకాల ప్రేమకథలు ఎన్నో కోణాల్లో తెరపై చిత్రీకరించబడ్డాయి.

హృదయాన్ని తాకిన ప్రతి ప్రేమకథా విజయతీరాలను చేరిందే. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల నేపథ్యంతో మా ‘కిరాక్ లవ్‌స్టోరి’ని తెరకెక్కించాం’’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, కాశీవిశ్వనాథ్, వెన్నెల కిషోర్, అశోక్‌వర్ధన్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు, రచనా సహకారం: డాక్టర్ ఆర్., కెమెరా: బి.దుర్గా కిషోర్, సంగీతం: అజయ్ అరసాద. కూర్పు: నందమూరి రామ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement