పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా షూటింగ్ చివరి దశకు చేరుకున్నా ఇంత వరకు టైటిల్ మాత్రం ప్రకటించలేదు. గతంలో పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న మ్యూజికల్ టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా పూర్తి పాటతో పాటు లిరికల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.