అనిరుధ్, సాగర్, భిక్షపతి
అనిరుధ్, యశస్విని జంటగా భిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో చంద్రకళ పందిరి నిర్మించిన చిత్రం ‘యాద్గిరి అండ్ సన్స్’. మే 5న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ‘భీమ్లా నాయక్’ చిత్రదర్శకుడు సాగర్ కె. చంద్ర ట్రైలర్‌ని ఆవిష్కరించారు. అనంతరం సాగర్ కె. చంద్ర మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ కొత్తగా ఉండటంతో దర్శకుడిని కథ అడిగాను.
వాస్తవ ఘటనలతో మంచి ప్రయత్నం చేశారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి’’ అన్నారు. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా’’ అన్నారు అనిరుధ్. ‘‘యాద్గిరి అండ్ సన్స్’ ఇంటెలిజెంట్ మూవీ. చాలా సిన్సియర్‌గా మ్యూజిక్ చేశాను’’ అన్నారు విజయ్ కురాకుల. ‘‘ప్రేక్షకులకు మంచి సినిమా ఇస్తున్నాం. చూసి,
నచ్చితే మరో పది మందికి చెప్పి, సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు భిక్షపతి రాజు.
Comments
Please login to add a commentAdd a comment