మంచి పాత్ర చేశాను | Siva 143 Pre Release Event | Sakshi
Sakshi News home page

మంచి పాత్ర చేశాను

Published Thu, Feb 13 2020 5:39 AM | Last Updated on Thu, Feb 13 2020 5:39 AM

Siva 143 Pre Release Event - Sakshi

హృతిక సింగ్‌

సాగర్‌ శైలేష్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘శివ 143’. అదరహ, హృతిక సింగ్‌ కథానాయికలు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ మాట్లాడుతూ– ‘‘సినిమాలు తీయాలంటే భయపడుతున్న ఈ రోజుల్లో రామసత్యనారాయణ 98 సినిమాలు తీశారంటే ఆసక్తికరంగా ఉంది’’ అన్నారు. ‘‘నాకు అన్ని ప్రాంతాల్లో సొంత పంపిణీదారులు ఉన్నారు.

వాళ్ల వల్లే ఈజీగా సినిమా రిలీజ్‌ చేయగలుగుతున్నా’’ అన్నారు రామసత్యనారాయణ. ‘‘98 సినిమాలు తీసి, రిలీజ్‌ చేయటం మాటలు కాదు. అందుకే నేను తీయబోయే 2 సినిమాలను రామసత్యనారాయణగారికి అప్పజెప్పాను’’ అన్నారు రచయిత చిన్నికృష్ణ. ‘‘నన్ను హీరోని, డైరెక్టర్‌ని చేసింది భీమవరం టాకీసే. ఇప్పుడు రెండోసారి చాన్స్‌ ఇచ్చినందుకు రామసత్యనారాయణగారికి ధన్యవాదాలు’’ అన్నారు సాగర్‌ శైలేష్‌. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అన్నారు హృతిక.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement