కోలుకున్న హిమాచల్ | Himachal recovered | Sakshi
Sakshi News home page

కోలుకున్న హిమాచల్

Published Sun, Oct 30 2016 2:01 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

Himachal recovered

గువహటి: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ కోలుకుంది. తొలి ఇన్నింగ్‌‌సలో కేవలం 36 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు రెండో ఇన్నింగ్‌‌సలో మాత్రం బాగానే ఆడింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ రెండో ఇన్నింగ్‌‌సలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. పారస్ డోగ్రా (101 బంతుల్లో 57; 7 ఫోర్లు), రాబిన్ బిస్త్ (113 బంతుల్లో 50 బ్యాటింగ్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు.


సిరాజ్, రవికిరణ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 126 పరుగులకై  ఆలౌటై 90 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. బాలచందర్ అనిరుధ్ (162 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా, రిషి ధావన్‌కు 7 వికెట్లు దక్కారుు. ప్రస్తుతం హిమాచల్ ఓవరాల్‌గా 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.

 
హరియాణా లక్ష్యం 371

ముంబై: ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో హరియాణా విజయానికి 371 పరుగులు చేయాల్సి ఉంది. మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 47 ఓవర్లలో మూడు వికెట్లకు 138 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఆ జట్టు మరో 233 పరుగులు చేయాలి. రోహిల్లా (75 బ్యాటింగ్), చాహల్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్‌‌సలో 70.1 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటరుుంది. విహారి (50) అర్ధసెంచరీ చేయగా.. శివకుమార్ (42) రాణించాడు. హరియాణా బౌలర్లలో మోహిత్ శర్మ, చాహల్ మూడేసి వికెట్లు తీశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement