
తమిళసినిమా: చిత్రానికి సంగీతం సగం బలం. సన్నివేశాల మూడ్‌ను ఎలివేట్ చేసేది సంగీతమే. హీరోహీరోయిన్లు, దర్శకుడి తరువాత ఎవరైనా అడిగేది సంగీత దర్శకుడెవరనే. ఒకే హీరోకు కంటిన్యూగా పనిచేసే సంగీత దర్శకులు అరుదనే చెప్పాలి. వివేగం చిత్రం తరువాత అజిత్ కాస్త విరామం తీసుకుని రీచార్జ్ అయ్యి విశ్వాసంతో రావడానికి రెడీ అవుతున్నారు.ఆయనతో ఇంతకు ముందు వీరమ్, వేదాళం, వివేగం చిత్రాలను చేసిన దర్శకుడు శివ మరోసారి ఈ చిత్రంతో రెండో హ్యాట్రిక్‌కు ప్రయత్నిస్తున్నారు.గత చిత్రాల్లో అజిత్‌ను సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో చూపించి సక్సెస్ అయిన శివ ఈ సారి స్మార్ట్ అజిత్‌ను తెరపైకి తీసుకురానున్నారనే ప్రచారం జోరందుకుంది. వివే గం నిర్మాత టి.త్యాగరాజనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
చిత్రాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ముమ్మరంగా సాగుతోంది. వారి వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ, సంగీత దర్శకుడెవరన్న విషయమై నిర్ణయం జరిగిపోయిందని సమాచారం. ఈ చిత్రానికి ముందుగా యువన్‌శంకర్‌రాజా పేరు తెరపైకి వచ్చింది. మంగాత్తా చిత్రం తరువాత అజిత్ నటించే విశ్వాసం చిత్రానికి ఆయన సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత ఇరుదుచుట్రు చిత్ర ఫేమ్ శ్యామ్.సీఎస్ పేరు ప్రచారంలోకి వచ్చింది. తాజాగా అనిరుద్‌నే సెట్ అయినట్లు సమాచారం. ఈ వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment