జీఎన్‌పీ సెగురోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ శుభారంభం చేశాడు. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్‌లో అనిరుధ్ (భారత్)–హాన్స్ హచ్ వెర్డొగో (మెక్సికో) ద్వయం 4–6, 6–4, 11–9తో చార్లెస్ బ్రూమ్ (బ్రిటన్)–ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జంట తమ సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో అనిరుధ్ జోడీ పైచేయి సాధించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జీవన్ నెడున్‌జెళియన్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 3–6, 6–3, 7–10తో ఆంటోని బెలిర్ (స్విట్జర్లాండ్)–లుకా సాంచెజ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment