
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో జెమిని ఫ్రెండ్స్ బౌలర్లు ఎన్. అనిరుధ్ (5/58), రతన్ తేజ (4/57) చెలరేగారు. వీరిద్దరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి హైదరాబాద్ బాట్లింగ్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. బుధవారం 71/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ బాట్లింగ్ అనిరుధ్, రతన్‌ల ధాటికి 77.5 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. జయరామ్ రెడ్డి (42), వినయ్ గౌడ్ (79) రాణించారు. దీంతో హైదరాబాద్‌కు 28 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జెమిని ఫ్రెండ్స్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులతో నిలిచింది. ఎం. అభిరత్ రెడ్డి (62 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుమందు తొలి ఇన్నింగ్స్‌లో జెమిని ఫ్రెండ్స్ జట్టు 64.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో ఆంధ్రా బ్యాంకు, ఎస్‌సీఆర్‌ఎస్; ఇన్‌కంట్యాక్స్, జై హనుమాన్ జట్ల మధ్య జరగాల్సిన రెండోరోజు ఆట రద్దయింది.
ఇతర మ్యాచ్‌ల వివరాలు
స్పోర్టింగ్ ఎలెవన్: 476 (హిమాలయ్ అగర్వాల్ 156, మీర్ జావీద్ అలీ 89, సన్నీ 58, యుధ్‌వీర్ సింగ్ 92; ముదస్సర్ హుస్సేన్ 3/16, ఆకాశ్ 3/67), బీడీఎల్: 40/1 (15 ఓవర్లలో).