శింబు కోసం పోలీసుల వేట | The Beep controversy: Kolaveri composer Anirudh, actor Simbu face trouble over 'vulgar' song | Sakshi
Sakshi News home page

శింబు కోసం పోలీసుల వేట

Published Wed, Dec 16 2015 8:42 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

శింబు కోసం పోలీసుల వేట

శింబు కోసం పోలీసుల వేట

చెన్నై : నటుడు శింబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయన మహిళలను అగౌర పరచే విధంగా అసభ్య పదజాలాలతో కూడిన పాటను రాసి, పాడి దాన్ని వాట్స్ యాప్‌లో పోస్ట్ చేశారని మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. కోవైకి చెందిన అఖిల భారత మాదర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాధిక నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌లపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోవై పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆయన ఆదేశాల మేరకు కోవై రేస్ కోర్స్ పోలీసులు శింబు, అనిరుద్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి రెండు రోజుల క్రితమే చెన్నై వచ్చారు.

అయితే శింబు అజ్ఞాతంలోకి వెళ్లడం. అనిరుద్ కెనడాలో ఉండడంతో వారి ఇళ్లకు సమన్లు అంటించారు. కాగా శింబును అరెస్ట్ చేసే తిరిగి రావాలని పోలీస్ కమిషనర్ గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో కోవై రేస్ కోర్స్ పోలీసులు చెన్నైలోనే మకాం వేసి శింబు ఆచూకీ తెలియక నగరంలోని వీధులన్నీ తిరుగుతూ తీవ్రంగా జల్లెడేసి గాలిస్తున్నారు. మరో పక్క మాదర్ సంఘానికి చెందిన వారు శింబు ఇంటిని చుట్టు ముట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు.
 
ఉరి తీయాలి: కాగా సీనియర్ నటుడు వైజీమహేంద్రన్ మహిళల్ని కించపరచే విధంగా అశ్లీల పదజాలాలతో కూడిన పాటను రాసిన వారెవరైనా వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలని తన ట్విట్టర్‌లో పేర్కొనడం విశేషం.ఇక పోతే  మంగళవారం కెనడా నుంచి చెన్నైకి తిరిగి రానున్న అనిరుద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం. కాగా శింబు తనకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తునట్లు తెలిసంది. మొత్తం మీద ఒక్క పాట కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోందని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement