త్రివిక్రమ్ సినిమా నుంచి అనిరుధ్ ఔట్ | anirudh walks out of trivikrams film | Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్ సినిమా నుంచి అనిరుధ్ ఔట్

Published Fri, Jan 22 2016 4:34 PM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

త్రివిక్రమ్ సినిమా నుంచి అనిరుధ్ ఔట్

త్రివిక్రమ్ సినిమా నుంచి అనిరుధ్ ఔట్

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్ హీరోగా అ.. ఆ.. సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.., ప్రస్తుతం మార్చి లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సమయంలో త్రివిక్రమ్కు అనుకోని షాక్ తగిలింది.

చాలా రోజులుగా త్రివిక్రమ్ సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. అయితే అ.. ఆ.. సినిమాకు తమిళ యువ సంచలనం అనిరుధ్ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఈ యువ సంగీత దర్శకుడు త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం ఇప్పుడు హడావిడిగా మరో సంగీత దర్శకుడి కోసం వేట ప్రారంభించాడు త్రివిక్రమ్. దేవీ శ్రీ ప్రసాద్తో పాటు, మిక్కీ జే మేయర్తోనూ సంప్రదింపులు జరుపుతున్న త్రివిక్రమ్, త్వరలోనే కొత్త సంగీత దర్శకుణ్ని ప్రకటించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement