అనిరుధ్‌కు తొలి అవకాశం | Anirudh selected to Hyderabad one day team | Sakshi
Sakshi News home page

అనిరుధ్‌కు తొలి అవకాశం

Published Thu, Feb 20 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

దేశవాళీ వన్డే టోర్నీ (సౌత్‌జోన్- కేఎస్ సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో పాల్గొనే హైదరాబాద్ జట్టును బుధవారం సెలక్టర్లు ప్రకటించారు.

హైదరాబాద్ వన్డే జట్టు ఎంపిక

 సాక్షి, హైదరాబాద్: దేశవాళీ వన్డే టోర్నీ (సౌత్‌జోన్- కేఎస్ సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో పాల్గొనే హైదరాబాద్ జట్టును బుధవారం సెలక్టర్లు ప్రకటించారు. అండర్-19 స్థాయిలో ఆకట్టుకున్న బి. అనిరుధ్‌కు తొలి సారి సీనియర్ జట్టులో చోటు లభించింది. ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ కోసం గతంలో ఎంపిక చేసిన భారత ప్రాబబుల్స్ జాబితాలో కూడా అనిరుధ్ ఉన్నాడు. ఈ నెల 27నుంచి మార్చి 5 వరకు బెంగళూరులో ఈ టోర్నమెంట్ జరుగుతుంది.

 జట్టు వివరాలు: అక్షత్ రెడ్డి, సుమన్, ప్రజ్ఞాన్ ఓజా, రవితేజ, విహారి, సందీప్ రాజన్, హబీబ్ అహ్మద్, అమోల్ షిండే, ఆశిష్ రెడ్డి, కనిష్క్ నాయుడు, రవికిరణ్, ఆల్ఫ్రెడ్ అబ్సలం, ఆకాశ్ భండారి, రాహుల్ సింగ్, బి. అనిరుధ్.
 కోచ్: సునీల్ జోషి, ఫీల్డింగ్ కోచ్: టి. దిలీప్, మేనేజర్: కమలేశ్ పారిఖ్
 
 హైదరాబాద్ అండర్-22 జట్టు

 సౌత్‌జోన్ అండర్-22 టోర్నీ (పీఎస్ రామ్మోహన్‌రావు ట్రోఫీ) కోసం కూడా హైదరాబాద్ జట్టును ఎంపిక చేశారు. ఈ నెల 27నుంచి మార్చి 5  వరకు ఈ టోర్నీ గోవాలో జరుగుతుంది.
 జట్టు వివరాలు: రోహిత్ రాయుడు, వంశీ వర్ధన్, సంతోష్ రెడ్డి, మల్లికార్జున్, అహ్మద్ అస్కరి, సత్యనారాయణ, ఫరాజ్ నవీద్, గఫార్ ఖాన్, రాహుల్ పతంగే, సిద్ధాంత్, అక్షత్ కుమార్, దత్త ప్రకాశ్, యష్‌పురి, ఆకాశ్ సనా, యువీ శ్రీకార్, సాకేత్ సాయిరాం.
 కోచ్: ఆర్. హరినారాయణ రావు, ఫీల్డింగ్ కోచ్: ఎల్. రాజేందర్, మేనేజర్: జి. రామకృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement