నా జోలికొస్తే ఊరుకోను | Vaibhav,Remya Nambeesan in 'Damaal Dumee' | Sakshi
Sakshi News home page

నా జోలికొస్తే ఊరుకోను

Published Thu, Jan 23 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM

నా జోలికొస్తే ఊరుకోను

నా జోలికొస్తే ఊరుకోను

నేనెవరి జోలికి వెళ్లను. ఎవరైనా నా జోలికొస్తే విపరీతమైన కోపం వచ్చేస్తుందని చెబుతున్నారు నటి రమ్యా నంబీశన్. ఈ మల యాళ బ్యూటీ మాతృభాషలోనే కాదు తమిళంలోనూ నటిగా, గాయనిగా పేరు తెచ్చుకుంటున్నారు. తమిళంలో పిజ్జా, కుళ్లనరి కూట్టం, అట్టహాసం తదితర చిత్రాల్లో నటించిన రమ్యా నంబీశన్ ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ భామ నటించిన ఢమాల్ ఢిమీల్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా రమ్యా నంబీశన్ మాట్లాడుతూ అభిమానులు తనను ఎక్కడ చూసినా పై పై పై కలాచ్చి పై అంటూ పాట పాడుతున్నారన్నారు.
 
 పాండియనాడు చిత్రంలో తాను పాడిన ఆ పాట అంతగా ప్రాచుర్యం పొంద టం ఆనందంగా ఉందన్నారు. అయితే తానెవరినీ పరిహాసం చేయట్లేదని, అదే విధంగా ఇతరులు తనతో ప్రవర్తించాలని ఆశిస్తానన్నా రు. లేకుంటే వారిని దరిదాపులకు కూడా రానివ్వనని స్పష్టం చేశారు. సమీప కాలంలో ఢమాల్ ఢిమీ ల్ చిత్ర ప్రచారంలో పాల్గొన్నానన్నారు. అక్కడ ఒక వ్యక్తి ‘‘మీకు, హీరో వైభవ్‌కు మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యిం దటగా’’ అనడం తనకు  కోపం తెప్పిం చిందన్నారు. అయితే అక్కడ తన కోపాన్ని అణచుకున్నానన్నారు. సెలబ్రిటీలకు ఇలాంటివి మామూలే అన్న విషయం ఈ భామకు తెలియదా అంటున్నారుు కోలీవుడ్ వర్గాలు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement