జీవితానికి దగ్గరగా... | Vaibhav's 'Dhana Dhan' in PPTelugu movie | Sakshi
Sakshi News home page

జీవితానికి దగ్గరగా...

Published Wed, Dec 17 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

జీవితానికి దగ్గరగా...

జీవితానికి దగ్గరగా...

వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని నిర్మిస్తున్న చిత్రం ‘ధనాధన్’. ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర సహాయ దర్శకునిగా చేసిన శ్రీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్. ఇందులో సాఫ్ట్‌వేర్ కుర్రాడిగా వైభవ్ నటించారు. నిజజీవితానికి దగ్గరగా ఉన్న కథతో ఈ చిత్రం సాగుతుంది. వైభవ్ నటన, రమ్యా నంబీసన్ అందచందాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కోట శ్రీనివాసరావు పాత్ర హైలైట్. ఇందులో ఉన్న ఐదు పాటలకు తమన్ అద్భుతమైన స్వరాలందించారు. అతి త్వరలో పాటలు విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శివపార్వతి, కెమెరా: ఎ.ఎమ్. ఎడ్విన్ సాకె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement