రహస్య వివాహమా?
రహస్య వివాహమా?
Published Mon, Oct 28 2013 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
తాను రహస్య వివాహం చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం దిగ్భ్రాంతికి గురి చేసిందని రమ్యా నంబీశన్ పేర్కొంది. కుళ్లనది కూట్టం, పిజ్జా తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ కేరళ కుట్టి తాజాగా గాయని అవతారమెత్తింది. దీపావళికి విడుదలకు సిద్ధమవుతున్న పాండియనాడు చిత్రంలో ఈ బ్యూటీ ఒక పాట పాడింది.
రమ్యా నంబీశన్ ప్రేమ వివాహం గురించి కొంతకాలంగా వదంతులు జోరుగా ప్రచారమవుతున్నాయి. మలయాళ చిత్రంలో తనతో నటించిన ఉన్ని ముకుందన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని రమ్యా నంబీవన్ తీవ్రంగా ఖండించింది. తాను రహస్య వివాహం చేసుకున్నానన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. తాను ఏ హీరోయిన్‌తోనూ డేటింగ్ చేసింది లేదని, అసలు సినిమా నటిని పెళ్లి చేసుకోనని ఉన్నిముకుందన్ తేల్చి చెప్పారు.
Advertisement
Advertisement