Pizza movie
-
భయపెట్టిస్తోన్న ‘పిజ్జా 3 ది మమ్మి’ గ్లింప్స్
అశ్విన్ కాకుమాను కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ మోహన్ గోవింద్ రూపొందిస్తోన్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పిజ్జా 3 ది మమ్మీ’. సీవీ కుమార్ నిర్మాణంలో రూపొందిన పిజ్జా 2 కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు సెన్సేషనల్ హిట్‌గా ఈ మూవీ నిలిచింది. అంతేగాక విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభంలో ఆయనకు నటుడిగా బ్రేక్ తెచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి. ఇప్పుడు మరోసారి నిర్మాత సీవీ కుమార్ అలాంటి హారర్ థ్రిల్లర్‌తో ‘పిజ్జా 3 ది మమ్మీ’చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో డైరీ ఫేమ్ పవిత్రా మారిముత్తు హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ గ్లింప్స్‌ను విడుదల చేయడం ద్వారా స్టార్ట్ చేసింది. గ్లింప్స్‌లో ప్రతి సీన్ భయం పుట్టిస్తోంది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్ అంచనాలు మరింత పెరిగాయి. గౌరవ్ నారాయణన్, అభిషేక్ శంకర్, కాళి వెంకట్, అనుపమ కుమార్, రవీనా దాహ, కురైసి, యోగి, సుభిక్ష ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. పిజ్జా2కు సీక్వెల్‌గా పిజ్జా3ని ఒరిజినల్ స్క్రిప్ట్‌తో రూపొందించారు. అశ్విన్ హేమంత్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. -
ప్రభుదేవా మూకీ సినిమా ‘మెర్క్యూరి’
డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం సినిమా తరహాలోనే ఈ సినిమాలోని పాత్రలు కూడా మాట్లాడవని తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
రహస్య వివాహమా?
తాను రహస్య వివాహం చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం దిగ్భ్రాంతికి గురి చేసిందని రమ్యా నంబీశన్ పేర్కొంది. కుళ్లనది కూట్టం, పిజ్జా తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ కేరళ కుట్టి తాజాగా గాయని అవతారమెత్తింది. దీపావళికి విడుదలకు సిద్ధమవుతున్న పాండియనాడు చిత్రంలో ఈ బ్యూటీ ఒక పాట పాడింది. రమ్యా నంబీశన్ ప్రేమ వివాహం గురించి కొంతకాలంగా వదంతులు జోరుగా ప్రచారమవుతున్నాయి. మలయాళ చిత్రంలో తనతో నటించిన ఉన్ని ముకుందన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని రమ్యా నంబీవన్ తీవ్రంగా ఖండించింది. తాను రహస్య వివాహం చేసుకున్నానన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. తాను ఏ హీరోయిన్‌తోనూ డేటింగ్ చేసింది లేదని, అసలు సినిమా నటిని పెళ్లి చేసుకోనని ఉన్నిముకుందన్ తేల్చి చెప్పారు.