Bustop Movie Actress Anandhi Married Tamil Assistant Director Socrates - Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న ‘బస్‌స్టాప్’‌ హీరోయిన్‌

Published Fri, Jan 8 2021 4:10 PM | Last Updated on Fri, Jan 8 2021 6:32 PM

Actor Anandhi Married Tamil Assistant Director Socrates In Secret - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కాలంలో పెళ్లి బాట పడుతున్న నటీనటుల సంఖ్య పెరిగిపోతోంది. టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచీలర్‌ రానా దగ్గుబాటి, నితిన్‌లు, నిహారి కొణిదెల వంటి కొంతమంది స్టార్‌లు ఇటీవల ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. తాజాగా ‘బస్‌స్టాప్’‌ ఫేం కయల్‌​ ఆనంది కూడా పెళ్లి పీటలు ఎక్కారు. తమిళ పరిశ్రమకు చెందిన సోక్రటీస్‌ను ఆమె గుట్టుగా పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆనంది తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ అసిస్టెంట్‌ట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న సోక్రటీస్‌తో ప్రేమలో పడ్డారు.

వారి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో గురువారం ఆమె సోంతూరైన వరంగల్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో‌ కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆమె వివాహ వేడుక జరిగింది. చేతి నిండా సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ నటిగా రాణిస్తున్న సమయంలో ఆమె సడెన్‌గా సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంపై టాలీవుడ్‌ వర్గాలు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్ర్తసుతం ఆనంది నటించిన ‘జాంబి రెడ్డి’ విడుదలకు సిద్దంగా ఉంది. అంతకుముందు తెలుగులో ‘ఈరోజుల్లో’, ‘బస్ట్ స్టాప్’, ‘నాయక్’, ‘ప్రియతమా నీవచటకుశలమా’, ‘గ్రీన్ సిగ్నల్’ వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత తమిళంలో బిజీ అయిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement