ఆ తర్వాత... కష్టమైన పాత్ర ఇదే! | Happy Anasuya is getting more attention: Adah Sharma | Sakshi
Sakshi News home page

ఆ తర్వాత... కష్టమైన పాత్ర ఇదే!

Published Mon, Feb 22 2016 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

ఆ తర్వాత... కష్టమైన పాత్ర ఇదే!

ఆ తర్వాత... కష్టమైన పాత్ర ఇదే!

‘‘ ‘శ్వేత’ క్యారెక్టర్ అసలు చేస్తానని అనుకోలేదు. ప్రేయసిగా, పెళ్లి తర్వాత ఓ పాపకు తల్లిగా ఈ సినిమాలో రెండు పార్శ్వాలున్న క్యారెక్టర్ చేశాను. నేను చేసిన హిందీ చిత్రం ‘1920’ తర్వాత చేసిన కష్టమైన పాత్ర ఇదే’’ అని కథానాయిక అదా శర్మ చెప్పారు. అడివి శేష్, అదా శర్మ జంటగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పీవీపీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మించిన చిత్రం ‘క్షణం’. అనసూయ కీలక పాత్ర పోషించారు. ఈ 26న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా అదా మాట్లాడుతూ-‘‘థ్రిల్‌కి గురి చేసే చిత్రం ఇది. నెక్ట్స్ ఏం జరుగుతుందో అంచనా వేయలేని విధంగా సాగే కథ ఇది. డ్యాన్సులు, ఐటమ్ సాంగ్స్ లేని సినిమాగా ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

బాలీవుడ్ మూవీ ‘కహానీ’ ఛాయలు ఈ చిత్రంలో ఉన్నాయని కొందరు అంటున్నారు. అటువంటిదేమీ లేదు. పీవీపీ లాంటి పెద్ద బ్యానర్ అండగా నిలవడంతోనే ఈ చిత్రం సాధ్యమైంది. అనసూయ మంచి పాత్ర చేసింది. ఈ సినిమాలో ప్రతి పాత్రకూ గుర్తింపుంటుంది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement