
100% లవ్‌లో లావణ్య
తమిళసినిమా: నటి లావణ్య త్రిపాఠికి కోలీవుడ్‌లో ఇప్పుడు టైమ్ వచ్చినట్లుంది. వరుసగా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఆదిలో బ్రహ్మ చిత్రంలో శశికుమార్‌కు జంటగా తమిళ చిత్ర పరిశ్రమకు దిగుమతి అయిన అయోధ్య నగరానికి చెందిన బ్యూటీ లావణ్యత్రిపాఠి. ఆ చిత్రం ప్రేక్షకాదరణను పొందకపోవడంతో ఇక్కడ అమ్మడిని పట్టించుకోలేదు. అయితే టాలీవుడ్‌లో అందాలరాక్షసి నంటూ పరిచయమైన లావణ్యకు అక్కడ లక్ బాగానే వరించింది.
అక్కడ సక్సెస్‌ఫుల్ నాయకిగా రాణిస్తున్న అ భామపై ఇప్పుడు కోలీవుడ్ దృష్టి సారిస్తోంది. ఇప్పటికే లావణ్య నటించిన మాయవన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అవకాశం లావణ్యను వరించిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నాగచైతన్య, తమన్నా జంటగా తెలుగులో రూపొందిన 100% లవ్ చిత్రం అక్కడ సూపర్‌హిట్ అయ్యింది. ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ దాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నార
ఆయన శిష్యుడు చంద్రమౌళి మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రంలో నాగచైతన్య పోషించిన పాత్రలో జీవీ.ప్రకాశ్‌కుమార్ నంటించనున్నారు.కాగా తమన్నా పాత్రను తమిళంలోనూ ఆమెనే నటించనుందని, కాదు నటి హెబ్బాపటేల్ నటించనుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా వందశాతం లవ్‌లో నటి లావణ్య త్రిపాఠి పడనున్నట్లు సమాచరం. ఇదే నిజమైతే జీవీ.ప్రకాశ్‌కుమార్, లావణ్యత్రిపాఠిల జంటను కోలీవుడ్‌లో చూడబోతున్నామన్నమాట.ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో నాజర్, లీవింగ్‌స్టన్, అంబిక నటించనున్నారు. త్వరలో సెట్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం షూటింగ్‌ను 90 శాతం లండన్‌లోనూ మిగిలి 10 శాతాన్ని ఇండియాలో నిర్వహించనున్నట్లు తెలిసింది.