
సిద్ధార్థ్
‘ఎరుపు పసుపు పచ్చ’ ఈ మూడు రంగులను మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడీ రంగులనే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారు తమిళ దర్శకుడు శశి. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని రూపొందించిన శశి కొత్త తమిళ చిత్రం ‘సివప్పు మంజళ్ పచ్చై’. సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ కుమార్ హీరోలుగా నటించారు. రమేశ్ పిళ్లై నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ‘ఎరుపు పసుపు పచ్చ’ టైటిల్‌తో అనువదిస్తున్నారు.
రమేశ్ పిళ్లై మాట్లాడుతూ– ‘‘ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌కి, బైక్ రేసర్‌కి మధ్య సాగే ఎమోషనల్ కథ ఇది. మంచి ఫ్యామిలీ డ్రామా. యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నా గత చిత్రం ‘బిచ్చగాడు’ని బాగా ఆదరించారు. నా నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఆలోచించి ఈ కథ తయారు చేశాను. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు శశి.
Comments
Please login to add a commentAdd a comment