ఒకానొక సమయంలో యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించి తనకంటూ అభిమానులను సంపాదించుకున్న హీరో సిద్దార్థ్. బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ హీరో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. తర్వాత హిందీ, తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడమే మర్చిపోయాడు. ఆయన చివరిగా 'గృహం' అనే తెలుగు సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన 'మహా సముద్రం'తో పాటు, 'ఒరేయ్ బామ్మర్ది' చిత్రాలు చేస్తున్నాడు.
శుక్రవారం సాయంత్రం ఒరేయ్ బామ్మర్ది టీజర్ రిలీజైంది. 'రోడ్డే నా ఆఫీస్, మాడ్చే ఎండే నా ఏసీ..' అన్న డైలాగ్‌తో తనో ట్రాఫిక్ పోలీస్ అని చెప్పకనే చెప్తున్నాడీ హీరో. ట్రాఫిక్‌లో, అదీ గ్యాపులో బండి నడిపేవాడే తోపు అని చెప్తున్నాడు మరో హీరో జీవీ ప్రకాశ్ కుమార్. 'దేశం గురించి తెలుసుకోవాలంటే ఇంటింటికీ వెళ్లనవసరం లేదు, రోడ్లు చెప్పేస్తాయ్ ఆ దేశం గురించి..' అంటూ సిద్దార్థ్ చెప్పే డైలాగులు బాగున్నాయి. 'బిచ్చగాడు' ఫేమ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రమేశ్ పిల్లై నిర్మిస్తున్నారు.
చదవండి: రష్మిక సినిమా: గాయపడ్డ హీరో
Comments
Please login to add a commentAdd a comment