
పెళ్లి చూపులుకి ఓకే!
పెళ్లి కాని అమ్మాయిలను ‘పెళ్లెప్పుడు?’ అని అడుగుతుంటారు. ఈ ప్రశ్న తమన్నా చాలాసార్లు ఎదుర్కొన్నారు. ‘జరిగినప్పుడు చెబుతానండి’ అని సమాధానం ఇస్తుంటారీ బ్యూటీ. ఇప్పుడు పెళ్లిచూపులకు రెడీ అయ్యారు. అయితే ఇవి రీల్ పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రితూ వర్మ నటించిన ‘పెళ్లి చూపులు’ తమిళ రీమేక్‌లో తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు.
ఈ చిత్రం తమిళ హక్కులను దర్శకుడు గౌతమ్ మీనన్ దక్కించుకున్నారు. నూతన హీరోతో ఈ రీమేక్‌ని తన సహాయ దర్శకుడు సెంథిల్ వీరాస్వామి దర్శకత్వంలో నిర్మించనున్నారు. తమన్నా స్టార్‌డమ్ ఈ చిత్రానికి వర్కవుట్ అవుతుందని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు.