ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వటం చాలా కాలంగా జరుగుతోంది. ఇటీవల తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను తమిళ నాట రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ శింబు హీరోగా రీమేక్ చేస్తున్నారు.
ఇటీవల ఎన్టీఆర్ టెంపర్‌ను అయోగ్య పేరుతో విశాల్ హీరోగా ప్రారంభించారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సినిమా చేరింది. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించిన ఈ సినిమా కోలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఓ స్టార్ హీరో ఈ రీమేక్‌లో నటించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment