
కుమారి కాదల్!
హెబ్బా పటేల్ ఇప్పుడు కాదల్ చేయబోతున్నారు. అదేనండి.. లవ్ చేయనున్నారు. ఎవర్ని అని అడుగుతున్నారా? సంగీతదర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ని. అయితే ఇది సినిమా ప్రేమ. ‘అలా ఎలా’ చిత్రంతో తెలుగులోకి పరిచయమై, ‘కుమారి 21ఎఫ్’తో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు హెబ్బా. ఇప్పుడీ కుమారి తెలుగులో హిట్ అయిన ‘100% లవ్’ తమిళ రీమేక్‌లో నటించబోతున్నారు.
ముందు తెలుగులో చేసిన తమన్నానే తీసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత సడన్‌గా లావణ్యా త్రిపాఠి తెరపైకొచ్చారు. అయితే ఫైనల్‌గా హాట్ గాళ్ హెబ్బా పటేల్‌కు ఆ ఛాన్స్ దక్కిందట. అధికారికంగా సైన్ చేయడమే ఆలస్యం. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా చంద్రమౌళి దర్శకత్వంలో తెలుగు ‘100% లవ్’కి దర్శకత్వం వహించిన సుకుమార్ ఈ రీమేక్‌ను నిర్మించనుండటం విశేషం. అన్నట్లు.. మూడేళ్ల క్రితమే హెబ్బా తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు. 2014లో వచ్చిన ‘తిరుమణమ్ ఎన్నుమ్ నిక్కా’లో స్మాల్ రోల్ చేశారు.