
ఉదోగ్యం విషయంలో పక్కాగా ఉంటాడా పోలీస్. తప్పు చేసినవాణ్ని ఎదిరించే విషయంలో అస్సలు లెక్క చేయడు. ఇలాంటి క్యారెక్టర్స్‌ని రవితేజ సునాయాసంగా చేసేస్తారు. ‘విక్రమార్కుడు, మిరపకాయ్’ వంటి సినిమాలు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీ హాసన్ కథానాయికగా నటించనున్నారని సమాచారం.
తమిళ ‘తేరీ’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారాయన. ఎందుకంటే ఈ షెడ్యూల్ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటొనీ’ (అఅఆ) షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నారట. ‘అఅఆ’ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు సినిమా షూటింగ్స్‌తో ఇటు ఇండియా అటు అమెరికా షిఫ్ట్ అవుతూ ఉంటారట రవితేజ.
Comments
Please login to add a commentAdd a comment