
ఒకటోసారి.. రెండో సారి.. మూడోసారి... రవితేజ–కాజల్ అగర్వాల్ ముచ్చటగా మూడోసారి జోడీ కడుతున్నారట. ‘వీర, సారొచ్చారు’ చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన ఈ జంట మరోసారి సందడి చేయనున్నారట. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’ సినిమా మే 24న విడుదల కానుంది.
ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రవితేజ. ఈ చిత్రంలో ఆయనకి జోడీగా కాజల్‌ని ఎంపిక చేశారట. శ్రీను వైట్ల మూవీకి గుమ్మడికాయ కొట్టగానే సంతోష్ శ్రీనివాస్ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు రవితేజ.
Comments
Please login to add a commentAdd a comment