Santhosh Srinivas
-
వెరైటీ మాస్
‘రాక్షసుడు’ సినిమాతో ఈ ఏడాది సూపర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుని మంచి ఫామ్‌లో ఉన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇదే ఉత్సాహంలో తన తర్వాతి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే పనులను మొదలుపెట్టారు. ఈ కొత్త సినిమాకు ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారు. సాయి శ్రీనివాస్ కోసం ఓ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ కథను సిద్ధం చేశారట సంతోష్. ఈ మాస్ కథ చాలా వెరైటీగా ఉంటుందట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. -
ఇటు ఇండియా అటు అమెరికా
ఉదోగ్యం విషయంలో పక్కాగా ఉంటాడా పోలీస్. తప్పు చేసినవాణ్ని ఎదిరించే విషయంలో అస్సలు లెక్క చేయడు. ఇలాంటి క్యారెక్టర్స్‌ని రవితేజ సునాయాసంగా చేసేస్తారు. ‘విక్రమార్కుడు, మిరపకాయ్’ వంటి సినిమాలు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీ హాసన్ కథానాయికగా నటించనున్నారని సమాచారం. తమిళ ‘తేరీ’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారాయన. ఎందుకంటే ఈ షెడ్యూల్ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటొనీ’ (అఅఆ) షూటింగ్లో జాయిన్ అవ్వనున్నారట. ‘అఅఆ’ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు సినిమా షూటింగ్స్‌తో ఇటు ఇండియా అటు అమెరికా షిఫ్ట్ అవుతూ ఉంటారట రవితేజ. -
రవితేజ సినిమాతో రీ ఎంట్రీ
స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్‌లలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాలేదు. ఫైనల్‌గా పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్గా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తొలి సూపర్ హిట్ అందుకున్నారు శృతి. అయితే తరువాత కూడా శృతి హాసన్ కెరీర్ సాఫీగా సాగలేదు. నెమ్మదిగా కెరీర్ గాడి తప్పింది. వరుసగా ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో శృతి సినిమాలకు దూరమైయ్యారు. గత ఏడాది కాటమరాయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతిహాసన్.. లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. లాంగ్ గ్యాప్ తరువాత ఓ తెలుగు సినిమాకు శృతి హాసన్ ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు శృతి ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బలుపు సినిమాలో రవితేజకు జోడీగా నటించిన శృతి ఈ సినిమాలో మరోసారి మాస్ మహారాజ్‌తో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నారు. -
ముచ్చటగా మూడోసారి
ఒకటోసారి.. రెండో సారి.. మూడోసారి... రవితేజ–కాజల్ అగర్వాల్ ముచ్చటగా మూడోసారి జోడీ కడుతున్నారట. ‘వీర, సారొచ్చారు’ చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన ఈ జంట మరోసారి సందడి చేయనున్నారట. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’ సినిమా మే 24న విడుదల కానుంది. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రవితేజ. ఈ చిత్రంలో ఆయనకి జోడీగా కాజల్‌ని ఎంపిక చేశారట. శ్రీను వైట్ల మూవీకి గుమ్మడికాయ కొట్టగానే సంతోష్ శ్రీనివాస్ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు రవితేజ. -
మళ్లీ లాఠీ?
మాంచి ఊపున్న పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రల్లో రవితేజ చాలా సార్లు ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మళ్లీ ఆయన లాఠీ పట్టడానికి రెడీ అవుతున్నారని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ‘తేరి’ సినిమా తెలుగు రీమేక్‌లో రవితేజ హీరోగా నటించనున్నారని టాక్. ‘కందిరీగ, రభస, హైపర్’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తమిళ ‘తేరి’ సినిమా ఆల్రెడీ తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదలైంది. రవితేజ హీరోగా రూపొందనున్న ఈ సినిమాలో కథ, కథనం కొత్తగా.. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట సంతోష్ శ్రీనివాస్. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చాన్స్ ఉండగా కేథరిన్, అమీజాక్సన్ కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎంటంటే.. సంతోష్ శ్రీనివాస్ దర్శకునిగా మారకముందు కెమెరామెన్‌గా వర్క్ చేశారు. రవితేజ హీరోగా నటించిన ‘ఖతర్నాక్’ చిత్రానికి ఆయనే కెమెరామేన్. ఆ సినిమాలోనూ రవితేజ పోలీస్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. -
పవన్ మరో సినిమా మొదలెడుతున్నాడు..!
రాజకీయాల్లో బిజీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో సినిమాకు గుడ్ బై చెప్పబోతున్నాడన్న వార్త కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న పవన్ కు అదే ఆఖరి సినిమా అన్న టాక్ కూడా వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలో పవన్ మరో సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటించే అవకాశాలు ఉన్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమాను డిసెంబర్ లో ప్రారంభించాలని భావిస్తున్నారట. తమిళ డైరెక్టర్ నేసన్ దర్శకత్వంలో పవన్ చేయాల్సిన సినిమా కూడా లైన్ లో ఉంది. వీటిలో పవన్ ఏ సినిమాను ముందు చేస్తాడో చూడాలి. -
పవన్ మనసు మార్చుకున్నాడా..?
సర్థార్ గబ్బర్‌సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత కాటమరాయుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. కాటమరాయుడు రీమేక్ సినిమా కావటం, అది కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సినిమా కావటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. దీంతో పవన్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా పునరాలోచనలో పడ్డాడు. కాటమరాయుడు సెట్స్ మీద ఉండగానే తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో వేదలం రీమేక్‌ను మొదలు పెట్టాడు పవన్. ఆ తరువాత యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ పవన్ మరో రీమేక్ సినిమా చేస్తున్నాడన్న వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ చేయబోయేది రీమేక్ కాదని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే ముందుగా సంతోష్ శ్రీనివాస్ సినిమానే మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు త్రివిక్రమ్ సినిమా తరువాత చేయాల్సిన వేదలం రీమేక్‌ను పక్కన పెట్టేయాలని భావిస్తున్నాడట. కాటమరాయుడు రిజల్ట్‌తో పవన్ రీమేక్ సినిమాల జోలికి వెళ్లకపోవటమే బెటర్ అని నిర్ణయించుకున్నాడు. -
రామ్ హైపర్ ఫస్ట్ లుక్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ హైపర్. నేను శైలజ సినిమాతో ఫాంలోకి వచ్చిన రామ్.. మరోసారి మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాడు. రామ్ ఎనర్జిలెవల్స్కు పర్ఫెక్ట్గా సరిపోయే కథను రెడీ చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో రూపొందిన కందిరీగ మంచి విజయం సాధించటంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న హైపర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. స్టైలిష్‌గా కనిపిస్తున్న రామ్ లుక్స్ యూత్‌కు బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న హైపర్‌కు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. -
ఫుల్ బిజీగా ఎనర్జిటిక్ హీరో
నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న రామ్ మరో మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. నేను శైలజ తరువాత ఏ తరహా కథ చేయాలో అర్ధం కాక చాలా రోజులు పాటు ఖాళీగానే ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ సినిమా పూర్తవ్వగానే పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఆ తరువాత మరోసారి నేను శైలజతో తన బ్రేక్ ఇచ్చిన కిశోర్ తిరుమలతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. ఒక్కో సినిమాకు నాలుగు నెలల సమయం పట్టినా.. కనీసం మరో ఏడాదిన్నర పాటు రామ్ యమ బిజీగా గడపనున్నాడు. -
రిస్క్ చేస్తున్న రామ్
చాలా కాలం తర్వాత ఇటీవల 'నేను శైలజ' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రామ్. ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చినా.. నెక్ట్స్ సినిమాల విషయంలో రిస్క్ చేస్తున్నాడు. ఇప్పటికే తనకు కందిరీగ లాంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టాడు. అయితే కందిరీగ తరువాత రభస లాంటి భారీ ఫ్లాప్ ఇచ్చిన సంతోష్‌తో రామ్ సినిమా చేయటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ సినిమా తరువాత కూడా మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్. గతంలో రామ్ హీరోగా 'ఎందుకంటే ప్రేమంట' లాంటి ఫ్లాప్ సినిమాను తెరకెక్కించిన కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. లవ్ స్టోరీస్ తెరకెక్కించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న కరుణాకరన్ రామ్ కోసం ఓ క్యూట్ లవ్ స్టోరీని రెడీ చేస్తున్నాడట. మరి రామ్ చేస్తున్న ఈ రిస్క్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. -
రామ్ కొత్త సినిమా మొదలైంది
నేను శైలజ సినిమాతో ఈ ఏడాది మొదట్లోనే సూపర్ హిట్ కొట్టిన రామ్, ఆ తరువాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనలోనే ఇన్ని రోజులు కాలం గడుపుతూ వచ్చాడు. గతంలో రోటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన రామ్, ఒకే తరహా పాత్రలు చేయటంతో ఆకట్టుకోలేకపోయాడు. మూస పాత్రలతో వరుస ఫ్లాప్‌లు ఎదురకావటంతో కొత్త తరహా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. నేను శైలజ సినిమాతో తన ఒరిజినల్ ఎనర్జీకి భిన్నంగా సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న రామ్ మంచి విజయాన్ని సాధించాడు. ఈ సినిమా తరువాత మరోసారి ప్రయోగం చేయాలా..? లేక, మాస్ సినిమాకే ఓటేయ్యాలా..? తేల్చుకోలేక దాదాపు మూడు నెలలుగా కాలీగానే ఉంటున్నాడు. ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చిన రామ్, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు. రామ్ హీరోగా తెరకెక్కిన కందిరీగ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్, వెంటనే రామ్ హీరోగా మరో సినిమా చేయడానికి ప్రయత్నించాడు. అయితే అది వర్క్ అవుట్ కాకపోవటంతో ఎన్టీఆర్ హీరోగా రభస సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా డిజాస్టర్ కావటంతో ఇంతకాలం కాలీగా ఉన్న ఈ యువ దర్శకుడు ప్రస్తుతం పక్కా స్క్రీప్ట్‌తో రామ్‌ను మెప్పించాడు. ఉగాది సందర్భంగా ప్రారంభమైన రామ్, సంతోష్ శ్రీనివాస్‌ల కొత్త సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. -
మరోసారి కందిరీగతో..!
తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. రామ్ హీరోగా తెరకెక్కిన కందిరీగ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్, ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. చాలా రోజులుగా, ఓ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌కు మెమరబుల్ హిట్ అందించాడు. ఈ సక్సెస్‌తో మరోసారి అదే కాంబినేషన్‌ను రిపీట్ చేయాలని ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాలేదు. రామ్ హీరోగా కందిరీగ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేసిన సంతోష్, ఆ సినిమా పట్టాలెక్కకపోవటంతో ఇతర హీరోల మీద దృష్టిపెట్టాడు. కందిరీగ సక్సెస్‌తో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. బుడ్డోడితో రభస సినిమా చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కారణంగా సినిమా మీద పూర్తి స్థాయిలో పని చేయలేకపోవటంతో ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సంతోష్, మరోసారి తనకు సక్సెస్ ఇచ్చిన కందిరీగ కాంబినేషన్ లోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది. -
అభిమానులను భయపెడుతున్నాడు
ప్రస్తుతం సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమా షూటింగ్లో ఉన్న పవన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అఫీషియల్‌గా ఏ సినిమా చేయబోయేది కన్ఫామ్ చేయకపోయినా.. పవన్ నెక్ట్స్ సినిమా దర్శకులుగా వినిపిస్తున్న పేర్లు మాత్రం, అభిమానులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా సక్సెస్‌కు చాలా దూరంలో ఉన్న దర్శకులు పవన్‌తో సినిమాకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.మొన్నటి వరకు తమిళ దర్శకుడు ఎస్ జె సూర్యతో పవన్ నెక్ట్స్ సినిమా ఉంటుందన్న వార్త టాలీవుడ్లో షికారు చేసింది. దాదాపుగా కన్ఫామ్ అయిన ఎస్ జె సూర్య ప్రాజెక్ట్‌ను ఇప్పుడు పవన్ పక్కన పెట్టేశాడట. తమిళ్లో సూపర్ హిట్ అయిన అజిత్ వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో కూడా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు పవర్ స్టార్. కందిరీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత రభసతో భారీ డిజాస్టర్‌ను అందించిన సంతోష్ శ్రీనివాస్‌ను వేదలం రీమేక్‌కు దర్శకుడిగా ఎంచుకున్నాడు. దీంతో అభిమానులు ఈ సినిమా రిజల్ట్‌పై డౌట్ పడుతున్నారు. మరి పవన్ ఈ కాంబినేషన్లో సినిమా చేస్తాడా లేక.. మరో గాసిప్‌తో ఆడియన్స్ ను తికమక పెడతాడా.. చూడాలి. -
కందిరీగ కాంబినేషన్లో మరో సినిమా
శివమ్ సినిమా రిజల్ట్‌తో డీలా పడ్డ రామ్, వెంటనే తేరుకొని స్పీడు పెంచుతున్నాడు. ప్రస్థుతం కిశోర్ దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న ఈ యంగ్ హీరో, ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు కమిట్ అవుతున్నాడు. గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన కాంబినేషన్లోనే ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రామ్. దేవదాస్, రెడీ లాంటి హిట్స్ తరువాత కెరీర్ కష్టాల్లో పడ్డ సమయంలో రామ్‌ను ఆదుకున్న సినిమా కందిరీగ. సంతోష్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఘనవిజయం సాధించి, రామ్ కెరీర్‌ను గాడిలో పెట్టింది. కందిరీగ తరువాత ఎన్టీఆర్ హీరోగా రభస సినిమా చేశాడు సంతోష్. అయితే ఆ సినిమా తఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. శివమ్ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన రామ్ మరోసారి సక్సెస్ కోసం సంతోష్ శ్రీనివాస్‌నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం కిశోర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే కందిరీగ కాంబినేషన్లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. కష్టాల్లో ఉన్న రామ్, సంతోష్ శ్రీనివాస్‌ల కెరీర్లను ఈ రిపీట్ కాంబినేషన్ మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. -
మరో లవ్‌స్టోరీతో వస్తున్ననితిన్
-
ఎన్టీఆర్ కొండంత భరోసా ఇచ్చారు!
‘‘పదిహేడేళ్ల నా సినీ జీవితం కళ్ల ముందు కదలాడుతోంది. ఓ తల్లిదండ్రులకు బిడ్డగా ఈ రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు నేనే ఓ తండ్రి స్థానానికి చేరుకున్నాను. ఈ రోజు నేను పచ్చగా ఉన్నానంటే దానికి కారణం... నా దైవం మా తాతగారు నందమూరి తారకరామారావుగారి ఆశీస్సులు, ప్రేక్షకుల అభిమానమే’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఆయన హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘రభస’. బెల్లంకొండ సురేశ్ సమర్పకుడు. సమంత, ప్రణీత కథానాయికలు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఎస్.ఎస్. రాజమౌళి ఆవిష్కరించి, వి.వి. వినాయక్‌కి అందించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కామెర్ల బారిన పడ్డాడు. మంచివాళ్లకు అంతా మంచే జరుగుతుంది. అందుకే అతను ఆ ఆపద నుంచి బయటపడగలిగాడు. తనకోసమైనా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ‘ఆది’ తర్వాత బెల్లంకొండ సురేశ్ సంస్థలో నేను చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు. సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు కొండంత భరోసా ఇచ్చారు ఎన్టీఆర్. అంతటి స్టార్ హీరో అయ్యుండి నా కోసం మూడు నెలల పాటు ఎదురు చూశారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఈ కథ వినగానే ఎన్టీఆర్ ‘ఓకే’ చేశారు. కానీ... నాకే నిద్ర పట్టలేదు. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టు అన్ని హంగులనూ కథలో మేళవించాను’’ అన్నారు. ‘ఆది’ అనుకోని విజయమని, ఈసారి అందరం అనుకుని ‘రభస’తో విజయం సాధించబోతున్నామనీ బెల్లంకొండ సురేశ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌తో ‘అదుర్స్-2’ తీస్తాననీ, ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి కూడా తారక్‌తో సినిమా చేస్తారనీ వినాయక్ చెప్పారు. యూనిట్ సభ్యులతో పాటు దిల్ రాజు, బండ్ల గణేశ్, పైడిపల్లి వంశీ, నీరజ కోన తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
సంతోష్ శ్రీనివాస్ ను ఓదార్చిన జూనియర్ ఎన్టీఆర్
మంచి అయినా.... చెడు అయినా ఒకోసారి భావోద్వేగాలను అదుపు చేసుకోవటం సాధ్యం కాదేమో. అది ఎక్కడైనా...ఎప్పుడైనా సరే మనసులోని భావాలను బయటకు వెల్లడిస్తుంటారు. సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రభస'కు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ ...ఆ సినిమా ఆడియో విడుదల సందర్భంగా కంటతడి పెట్టాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన అతడు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్...సంతోష్ శ్రీనివాస్ భుజం తట్టి ఓదార్చారు. వివరాల్లోకి వెళితే రభస షూటింగ్ సమయంలో సంతోష్ శ్రీనివాస్‌కు అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి కామెర్లు (జాండీస్) రావటంతో షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు మూడు నెలలు షూటింగ్ నిలిచిపోయింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ అందించిన మానసిక ధైర్యం తనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు కన్నీళ్ళు వస్తాయని సంతోష్ శ్రీనివాస్ తెలిపాడు. ఓ టాప్ హీరో... దర్శకుడి కోసం మూడు నెలలు ఆగారని దర్శకుడు తెలిపాడు. కష్టకాలంలో అండగా నిలిచిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని సంతోష్ శ్రీనివాస్ వేదికపై కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఆడియో వేడుక అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు జాగ్రత్తలు తెలిపారు. ఇంటికి క్షేమంగా వెళ్లాలని, ఎప్పుడూ చెప్పేదే అయినా... తండ్రి అయిన తర్వాత తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పటం విశేషం. -
తిక్కరేగేది రవితేజకే(నా)?