![raviteja once again police role - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/11/Untitled-5.jpg.webp?itok=IBBhy67h)
మాంచి ఊపున్న పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రల్లో రవితేజ చాలా సార్లు ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మళ్లీ ఆయన లాఠీ పట్టడానికి రెడీ అవుతున్నారని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ‘తేరి’ సినిమా తెలుగు రీమేక్‌లో రవితేజ హీరోగా నటించనున్నారని టాక్. ‘కందిరీగ, రభస, హైపర్’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తమిళ ‘తేరి’ సినిమా ఆల్రెడీ తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదలైంది.
రవితేజ హీరోగా రూపొందనున్న ఈ సినిమాలో కథ, కథనం కొత్తగా.. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట సంతోష్ శ్రీనివాస్. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చాన్స్ ఉండగా కేథరిన్, అమీజాక్సన్ కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎంటంటే.. సంతోష్ శ్రీనివాస్ దర్శకునిగా మారకముందు కెమెరామెన్‌గా వర్క్ చేశారు. రవితేజ హీరోగా నటించిన ‘ఖతర్నాక్’ చిత్రానికి ఆయనే కెమెరామేన్. ఆ సినిమాలోనూ రవితేజ పోలీస్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment