మరోసారి కందిరీగతో..!
మరోసారి కందిరీగతో..!
Published Tue, Apr 5 2016 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. రామ్ హీరోగా తెరకెక్కిన కందిరీగ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్, ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. చాలా రోజులుగా, ఓ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్కు మెమరబుల్ హిట్ అందించాడు. ఈ సక్సెస్తో మరోసారి అదే కాంబినేషన్ను రిపీట్ చేయాలని ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాలేదు. రామ్ హీరోగా కందిరీగ సినిమాకు సీక్వెల్ను ప్లాన్ చేసిన సంతోష్, ఆ సినిమా పట్టాలెక్కకపోవటంతో ఇతర హీరోల మీద దృష్టిపెట్టాడు.
కందిరీగ సక్సెస్తో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. బుడ్డోడితో రభస సినిమా చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కారణంగా సినిమా మీద పూర్తి స్థాయిలో పని చేయలేకపోవటంతో ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సంతోష్, మరోసారి తనకు సక్సెస్ ఇచ్చిన కందిరీగ కాంబినేషన్ లోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది.
Advertisement
Advertisement