Rabhasa
-
మరోసారి కందిరీగతో..!
తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. రామ్ హీరోగా తెరకెక్కిన కందిరీగ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్, ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. చాలా రోజులుగా, ఓ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌కు మెమరబుల్ హిట్ అందించాడు. ఈ సక్సెస్‌తో మరోసారి అదే కాంబినేషన్‌ను రిపీట్ చేయాలని ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాలేదు. రామ్ హీరోగా కందిరీగ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేసిన సంతోష్, ఆ సినిమా పట్టాలెక్కకపోవటంతో ఇతర హీరోల మీద దృష్టిపెట్టాడు. కందిరీగ సక్సెస్‌తో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. బుడ్డోడితో రభస సినిమా చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కారణంగా సినిమా మీద పూర్తి స్థాయిలో పని చేయలేకపోవటంతో ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సంతోష్, మరోసారి తనకు సక్సెస్ ఇచ్చిన కందిరీగ కాంబినేషన్ లోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది. -
'రభస'తో దిమ్మతిరిగిపోయింది!
చెన్నై: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'రభస'తో ఆ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు దిమ్మతిరిగిపోయింది. ఈ చిత్రం కారణంగా సురేష్ భారీ నష్టాన్ని చవిచూడవలసి వచ్చింది. బకాయిలు పెరిగిపోయాయి. తనయుడు శ్రీనివాస్ నటించిన 'అల్లుడు శ్రీను' విజయం సాధించినప్పటికీ అతను బయటపడలేకపోయారు. దాంతో తన కొడుకు శ్రీనివాస్ తదుపరి మూవీని నల్లమలుపు బుజ్జికి అప్పగించారు. అల్లు అర్జున్ హీరోగా తను నిర్మించిన 'రేసుగుర్రం' సినిమా హిట్‌తో బుజ్జి మంచి ఊపుమీద ఉన్నారు. బుజ్జి నిర్మించే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన తమన్నా నటిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ** -
బెంగళూరు డేసే కాపాడాలి!
-
రభస మూవీ పోస్టర్స్
-
బెల్లంకొండ సురేష్, మంచు లక్ష్మిలపై పోలీస్ కేసులు
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, నటి మంచు లక్ష్మీప్రసన్నలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. డబ్బు లావాదేవీలకు సంబంధించి ఇరువురూ ఒకరిపై ఒకరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. బెల్లంకొండ సురేష్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంచు లక్ష్మిపై కేసు నమోదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, సమంత జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 'రభస' సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి నిర్మించిన 'ఊ కొడతారా...ఉలిక్కి పడతారా' సినిమా సెట్‌ను రభస చిత్రం కోసం అద్దెకు తీసుకున్నారు. దీనికి 58 లక్షల రూపాయలు ఇస్తానని సురేష్ మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆ డబ్బు ఇవ్వకపోవడంతో . తమకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చి ఈ చిత్రం విడుదల చేసుకోమని మంచు లక్ష్మి గట్టిగా పట్టుబట్టారు. అంతే కాకుండా బెల్లంకొండ సురేష్ ఇంటివద్ద మంచు లక్ష్మికి చెందిన కొందరు వ్యక్తులు తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వాలని ధర్నా చేశారు.. ఈ విషయమై బెల్లంకొండ సురేష్ వివరణ ఇస్తూ గతంలో తన బ్యానర్లో మంచు విష్ణుతో ఓ సినిమా నిర్మించేందుకు కొంత డబ్బు అడ్వన్స్ ఇచ్చానని తెలిపారు. వివిధ కారణాల వల్ల ఆ సినిమా నిర్మించలేకపోయినట్లు చెప్పారు. అందువల్ల ఆ మొత్తంలో తను ఇవ్వల్సిన మొత్తంని మినహాయించుకోమని చెప్పినట్లు తెలిపారు. అయితే విష్ణుకు ఇచ్చిన డబ్బుకు దీనికి లింక్ పెట్టవద్దని మంచు లక్ష్మి చెప్పారు. తన డబ్బు తనకు ఇవ్వమని కోరారు. చిలికి చిలికి చివరకు ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకునేవరకు ఈ సమస్య వచ్చింది. -
సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు: ప్రణీత
అసలు తాను సినిమాల్లో నిలబడగలనని ఏమాత్రం అనుకోలేదని సోగకళ్ల సుందరి ప్రణీత చెప్పింది. డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిన తాను బాగా చదువుకుని ఏదో ఒక రంగంలో స్థిరపడాలనే అనుకున్నాను గానీ, అసలు తాను గానీ తన త్లలిదండ్రులు గానీ అసలు తాను హీరోయిన్ అవుతానని, విజయాలు సాధిస్తానని అనుకోలేదని తెలిపింది. 2010లో 'పోర్కి' అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రణీత.. ఇప్పటికి దాదాపు 12 సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్‌తో కలిసి చేసిన 'అత్తారింటికి దారేది'తో టాలీవుడ్లో ఆమె దశ తిరిగింది. తన కెరీర్ సాగుతున్న తీరుపట్ల చాలా సంతృప్తిగా ఉందని, కన్నడ అమ్మాయినైన తాను.. అసలు సినిమాల్లోకి వస్తాననే భావించలేదంది. నాలుగేళ్ల క్రితం అయితే అసలు తాను ఇక్కడకు వస్తానని కూడా ఎవరూఊహించలేదని ప్రణీత తెలిపింది. ఇక్కడన్నీ ప్రయోగాలు చేయడం, అలా వెళ్లిపోవడమేనని వివరించింది. ఎన్టీఆర్ సరసన ఆమె నటించిన రభస చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ పాత్రలో మాస్ ప్రేక్షకులకు కావల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఉంటాయని చెప్పింది. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని, ఆయన డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాల్సిందేనని ప్రణీత చెప్పింది. -
''రాకాసి.. రాకాసి'' పాటపాడిన ఎన్టీఆర్
-
హంగామా తగ్గించిన ఎన్టీఆర్
-
రభస మూవీ న్యూ స్టిల్స్
-
అబ్బాయి 'ట్వీట్'ని బాబాయ్ స్వీకరిస్తారా?
నందమూరి ఫ్యామిలీలో నెలకొన్న నిశ్శబ్దాన్ని చాలా రోజులకు జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. గత కొంతకాలంగా బాబాయ్‌కి దూరంగా ఉన్న అబ్బాయ్.... ట్విట్టర్ ద్వారా పలకరించాడు. నాలుగు రోజుల క్రితం ఓ షూటింగ్లో నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే. సినిమా చిత్రీకరణలో భాగంగా బాలయ్య బైక్ మీదనుంచి జారిపడటంతో స్వల్పంగా గాయపడ్డాడు. దాంతో బాలయ్య ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అది కూడా ట్విట్వర్ వేదికగా. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో స్పందిస్తూ... 'అభిమానులు కంగారుపడొద్దు, బాబాయ్ క్షేమంగా ఉన్నాడు' అని ట్వీట్ చేశాడు. మళ్లీ సింహం గర్జిస్తుందని తన ట్వీట్లో పేర్కొన్నాడు. బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూ.ఎన్టీఆర్ విష్ చేశాడు. అయితే ఇద్దరు హైదరాబాద్‌లో ఉన్నా.... జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా బాబాయ్‌ని కలిసి ఆరోగ్యంపై ఆరా తీయకుండా కేవలం సోషల్ మీడియా ద్వారానే పలకరించటం విశేషం. ఇటీవలి కాలంలో నందమూరి ఫ్యామిలీ ఒకటిగా కనిపించిన దృశ్యాలు అరుదనే చెప్పుకోవచ్చు. ఇక నందమూరి కుటుంబం మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవకాశం ఉన్నప్పుడల్లా తామంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇచ్చినా అవి చిలకపలుకుల్లాంటివే. ఇటీవలి జరిగిన ఎన్నికలు నందమూరి ఫ్యామీలి మధ్య విభేదాలు తారాస్థాయికి తీసుకు వెళ్లాయి. తండ్రి హరికృష్ణను చంద్రబాబు పక్కనపెట్టి... బాబాయ్‌కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటంతో పాటు... పార్టీలో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో హరితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా కినుక వహించారు. దాంతో ఎన్నికల ప్రచారానికి కూడా వారు దూరంగా ఉన్నారు. పిలిస్తే తాను పార్టీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఇదే విషయమై బాలకృష్ణ స్సందిస్తూ 'ప్రచారం చేయాలని ఎవ్వరినీ బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఇదేమి ఇంట్లో పెళ్లికాదు' అని వ్యాఖ్యానించిన తెలిసిందే. అప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీలో వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా బాబాయ్ ఆరోగ్యంపై జూనియర్ స్పందించటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రభస త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో... బాబాయ్‌తో పాటు అభిమానులకు చేరువ కావటానికి... జూనియర్ ప్రయత్నిస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రభస ఆడియో విడుదల కార్యక్రమంలోనూ అబ్బాయ్ ఒంటరిగానే కనిపించాడు. మరి అబ్బాయి 'ట్వీట్' పలకరింపును బాబాయ్ ఎలా స్వీకరిస్తారో చూడాలి. ఇక గాయపడిన బాలయ్యను చంద్రబాబు స్వయంగా వెళ్లి పలకరించటం కొసమెరుపు. -
ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తున్న ఎన్టీఆర్ పాట
-
మా రెండో అబ్బాయిని కూడా హీరోని చేస్తాను!
‘‘మా అబ్బాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు శీను’ విడుదలై ఇప్పటికి మూడు వారాలైంది. ఇంకా మంచి వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది కాబట్టి, ఎన్టీఆర్ హీరోగా నేను నిర్మిస్తున్న ‘రభస’ విడుదలను వాయిదా వేశామని అనుకుంటున్నారు. కానీ, అందులో నిజం లేదు’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బెల్లంకొండ మాట్లాడుతూ- ‘‘ఈ నెల 15న ‘రభస’ను విడుదల చేయాలనుకున్నాం. కానీ, ఇంకొన్ని కార్యక్రమాలు పూర్తి కావాలి. అందుకే వాయిదా వేశాం. ఈ నెల 29న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. శ్రీనివాస్‌కి బయటి సంస్థల్లో అవకాశాలు వచ్చాయని బెల్లంకొండ చెబుతూ - ‘‘మీ అబ్బాయి బాగా నటించాడని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది. తొలి చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించినా, అందుకు తగ్గ వసూళ్లు రాబడుతోంది కాబట్టి, మలి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తోనే నిర్మించడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రాన్ని నా సంస్థలోనే తీయాలా? లేక బయటి సంస్థకు ఇవ్వాలా? అనేది నిర్ణయించలేదు’’ అన్నారు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ని ఎంపిక చేశారట? అనే ప్రశ్నకు, ఇంకా కథానాయికను ఖరారు చేయలేదని చెప్పారు బెల్లంకొండ. తన రెండో కుమారుడు గణేశ్‌ని కూడా హీరోని చేయాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు. -
రవితేజ,ఎన్టీర్ పోటా పోటీ
-
'రభస వాయిదాపై ఎన్టీఆర్ గరం?
'రభస' చిత్రం వాయిదా వేయడంపై నిర్మాతపై జూనియర్ ఎన్టీఆర్ గుర్రుగా ఉన్నట్టు ఫిలింనగర్ సమాచారం. వాస్తవానికి రభస చిత్రం ఆగస్టు 15 తేదిన విడుదల కావాల్సి ఉంది. అయితే తన కుమారుడు నటించిన 'అల్లుడు శీను' చిత్రం బిజినెస్ బాగా ఉండటం కారణంగా నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పరిశ్రమకు చెందిన వారు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అల్లుడు శ్రీను బిజినెస్ ఇంకా మంచి ఊపులోనే ఉంటటం వలన రభస చిత్రాన్ని వాయిదా వేయాలని బయ్యర్లు కోరినట్టు తెలుస్తోంది. అందుకే 'రభస' విడుదల ఆగస్తు 28 తేదికి వాయిదా వేశారని అంటున్నారు. రభస వాయిదా వేయడంపై జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆగస్టు 15 తేదిన సూర్య నటించిన 'సికిందర్' విడుదలవుతున్న కారణంగా నిర్మాత జాగ్రత్త పడినట్టు తెలిసింది. సికిందర్ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 'రభస' చిత్రం కోసం ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ అభిమానులు కూడా కొంత నిరుత్సాహం చెందినట్టు సమాచారం. సమంత, ప్రణీత హీరొయిన్లుగా నటిస్తున్న రభస చిత్రానికి కందిరీగ 'ఫేం' సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. -
రభస ఆడియో వేడుక విశేషాలు
-
కన్నీళ్లు పెట్టుకున్న రభస దర్శకుడు
-
పాడమంటూ సమంత.. పాడనంటూ ఎన్టీఆర్!
-
రభస మూవీ లేటస్ట్ పోస్టర్స్
-
ఎన్టీఆర్ కొండంత భరోసా ఇచ్చారు!
‘‘పదిహేడేళ్ల నా సినీ జీవితం కళ్ల ముందు కదలాడుతోంది. ఓ తల్లిదండ్రులకు బిడ్డగా ఈ రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు నేనే ఓ తండ్రి స్థానానికి చేరుకున్నాను. ఈ రోజు నేను పచ్చగా ఉన్నానంటే దానికి కారణం... నా దైవం మా తాతగారు నందమూరి తారకరామారావుగారి ఆశీస్సులు, ప్రేక్షకుల అభిమానమే’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఆయన హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘రభస’. బెల్లంకొండ సురేశ్ సమర్పకుడు. సమంత, ప్రణీత కథానాయికలు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఎస్.ఎస్. రాజమౌళి ఆవిష్కరించి, వి.వి. వినాయక్‌కి అందించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కామెర్ల బారిన పడ్డాడు. మంచివాళ్లకు అంతా మంచే జరుగుతుంది. అందుకే అతను ఆ ఆపద నుంచి బయటపడగలిగాడు. తనకోసమైనా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ‘ఆది’ తర్వాత బెల్లంకొండ సురేశ్ సంస్థలో నేను చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు. సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు కొండంత భరోసా ఇచ్చారు ఎన్టీఆర్. అంతటి స్టార్ హీరో అయ్యుండి నా కోసం మూడు నెలల పాటు ఎదురు చూశారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఈ కథ వినగానే ఎన్టీఆర్ ‘ఓకే’ చేశారు. కానీ... నాకే నిద్ర పట్టలేదు. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టు అన్ని హంగులనూ కథలో మేళవించాను’’ అన్నారు. ‘ఆది’ అనుకోని విజయమని, ఈసారి అందరం అనుకుని ‘రభస’తో విజయం సాధించబోతున్నామనీ బెల్లంకొండ సురేశ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌తో ‘అదుర్స్-2’ తీస్తాననీ, ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి కూడా తారక్‌తో సినిమా చేస్తారనీ వినాయక్ చెప్పారు. యూనిట్ సభ్యులతో పాటు దిల్ రాజు, బండ్ల గణేశ్, పైడిపల్లి వంశీ, నీరజ కోన తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
సంతోష్ శ్రీనివాస్ ను ఓదార్చిన జూనియర్ ఎన్టీఆర్
మంచి అయినా.... చెడు అయినా ఒకోసారి భావోద్వేగాలను అదుపు చేసుకోవటం సాధ్యం కాదేమో. అది ఎక్కడైనా...ఎప్పుడైనా సరే మనసులోని భావాలను బయటకు వెల్లడిస్తుంటారు. సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రభస'కు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ ...ఆ సినిమా ఆడియో విడుదల సందర్భంగా కంటతడి పెట్టాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన అతడు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్...సంతోష్ శ్రీనివాస్ భుజం తట్టి ఓదార్చారు. వివరాల్లోకి వెళితే రభస షూటింగ్ సమయంలో సంతోష్ శ్రీనివాస్‌కు అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి కామెర్లు (జాండీస్) రావటంతో షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు మూడు నెలలు షూటింగ్ నిలిచిపోయింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ అందించిన మానసిక ధైర్యం తనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు కన్నీళ్ళు వస్తాయని సంతోష్ శ్రీనివాస్ తెలిపాడు. ఓ టాప్ హీరో... దర్శకుడి కోసం మూడు నెలలు ఆగారని దర్శకుడు తెలిపాడు. కష్టకాలంలో అండగా నిలిచిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని సంతోష్ శ్రీనివాస్ వేదికపై కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఆడియో వేడుక అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు జాగ్రత్తలు తెలిపారు. ఇంటికి క్షేమంగా వెళ్లాలని, ఎప్పుడూ చెప్పేదే అయినా... తండ్రి అయిన తర్వాత తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పటం విశేషం. -
రభస మూవీ ఆడియో వేడుకా
-
‘రాకాసి..’ పాటను ఎన్టీఆర్ అద్భుతంగా పాడారు!
‘‘ఓ శక్తిమంతమైన కథ కుదిరితే ఎన్టీఆర్ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పడానికి ‘సింహాద్రి’ ఓ ఉదాహరణ. అందుకే ‘రభస’ సినిమా విషయంలో నాకెలాంటి సందేహం లేదు. కథ అంత గొప్పగా వచ్చింది’’ అని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఆత్మవిశ్వాసం కనబరిచారు. ‘కందిరీగ’తో మెగాఫోన్ పట్టిన ఈ ఛాయాగ్రాహకుడు ప్రస్తుతం ఎన్టీఆర్, సమంత, ప్రణీత కాంబినేషన్లో బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా ‘రభస’ చేస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సంతోష్ శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ‘కందిరీగ’ తర్వాత చాలా విరామం తీసుకుని ‘రభస’ మొదలుపెట్టాను. దానికి కారణం కథ. బౌండ్ స్క్రిప్ట్ కుదిరిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాం. నా ఆరోగ్యం బాగాలేక ఓ రెండు నెలలు విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా 135 రోజుల్లో సినిమా పూర్తి కావడం ఆనందంగా ఉంది. అవుట్‌పుట్ చాలా సంతృప్తికరంగా వస్తోంది. ఈ నెల 23తో షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోతో సినిమా చేయడం ఓ మంచి అనుభవం. చెప్పిన సమయానికి అరగంట ముందే లొకేషన్లో ఉంటారాయన. ప్రతి తల్లీ ఇలాంటి కొడుకు కావాలనీ, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందనే విధంగా ‘రభస’లో ఆయన పాత్ర ఉంటుంది. ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్. ఇందులోని ‘రాకాసి...’ పాటను ఆయనతో పాడించాలన్నది సంగీతదర్శకుడు తమన్ ఆలోచనే. ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అద్భుతంగా పాడారు. ఎన్టీఆర్‌లో మంచి గాయకుడు ఉన్నాడు. నా మలి సినిమాకి కూడా బెల్లంకొండ సురేశే నిర్మాత కావడం ఆనందంగా ఉంది. కథ గురించి మా మధ్య వాదోపవాదాలు జరిగాయి. సురేశ్‌కి మంచి జడ్జిమెంట్ ఉంది. ఆయనకు సంతృప్తిగా అనిపించిన సినిమా, కచ్చితంగా ప్రేక్షకులను కూడా సంతృప్తిపరుస్తుంది. కథ డిమాండ్ చేసిన మేరకు వెనుకాడకుండా ఖర్చుపెట్టడం ప్లస్ పాయింట్. త్వరలో ‘తిక్క రేగితే’ పేరుతో ఓ సినిమా చేస్తాను. హీరో ఎవరనేది సస్పెన్స్. ‘కందిరీగ’ హిందీ రీమేక్ నన్ను చేయమన్నారు. కానీ, అప్పటికే ‘రభస’ ప్లాన్ చేయడంతో చేయలేకపోయాను. ‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా పరిచయమవుతోన్న బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ లవ్‌స్టోరీ చేయాలని ఉంది. తను మంచి మాస్ కమర్షియల్ హీరో అవుతాడు. -
'రాకాసి..రాకాసి' అంటున్న జూనియర్ ఎన్టీఆర్!
యమదొంగ, కంత్రి చిత్రాలతో తన గళంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరోసారి గాయకుడిగా మారారు. తర్వలో విడుదల కానున్న రభస చిత్ర కోసం రాకాసి.. రాకాసి అంటూ జూనియర్ ఎన్టీఆర్ పాట పాడారని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రభస చిత్రం కోసం పాట పాడారు. పాట పేరు రాకాసి.. రాకాసి. త్వరలో రభస ఆడియో విడుదల కానుంది అంటూ తమన్ ట్విటర్ లో వెల్లడించారు. సమంత, ప్రణీత లు ఎన్టీఆర్ కు జంటగా నటిస్తున్న రభస చిత్రానికి 'కందిరీగ' సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్, ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత బెల్లంకొండ సురేష్. Young tiger #NTR Sings fr #Rabhasa Name of the Song is #Rakhasi Rakasi :) Audio release date will be Updated Soon :) pic.twitter.com/HEDzoDG1yc — SST (@MusicThaman) July 15, 2014(ఇంగ్లీషు కథనం కోసం క్లిక్ చేయండి) -
'అంజాన్' టీజర్‌కు మంచి రెస్పాన్స్
-
'సికిందర్'తో 'రభస'కు ఎన్టీఆర్ సిద్ధం
-
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘రభస’ ఫస్ట్‌లుక్
-
''రభస'' టీజర్ విడుదల
-
పండగే పండగ
మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడాయన దృష్టి మొత్తం విజయంపైనే. అందుకే... కసితో ‘రభస’ సినిమా చేస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం ‘రభస’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేశ్. ఆగస్ట్ 14న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సినిమా గురించి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘‘రభస’లో ఎన్టీఆర్ సామాన్యులను ఎంతో ఆకట్టు కుంటారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఆయన పాత్ర చిత్రణ సాగుతుంది. అందరూ అయిదారుసార్లు చూసేంత వినోదాత్మకంగా ఉంటుందీ సినిమా. అభిమానులకైతే పండుగలా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రం బెల్లంకొండ సురేశ్ మేకింగ్ సత్తాను తెలియజేస్తుంది’’ అని చెప్పారు. ఎన్టీఆర్ కెరీర్లోనే కాదు, తమ సంస్థకు కూడా ఈ సినిమా ప్రత్యేకమైనదని బెల్లంకొండ సురేశ్ తెలిపారు. సమంత నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలందిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో... ఎన్టీఆర్ వేగం పెంచారు. ‘రభస’ తర్వాత వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. పూరి జగన్నాథ్‌తో ఓ చిత్రానికి పచ్చజెండా ఊపారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రానికి బండ్ల గణేశ్ నిర్మాత. ‘‘మా సంస్థ నిర్మించిన ‘బాద్షా’ చిత్రం తారక్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ సినిమా సమయంలోనే మా సంస్థలో మరో సినిమా చేస్తానని ఆయన మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్-పూరీజగన్నాథ్ లాంటి క్రేజీ కాంబినేషన్‌తో చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమా వివరాలు త్వరలో తెలియజేస్తా’’ అని గణేశ్ తెలిపారు. ఈ రెండు చిత్రాలతో పాటు పీవీపీ సంస్థ నిర్మించనున్న చిత్రంలో కూడా ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రంలో నాగార్జునతో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆయన చేస్తున్న తొలి మల్టీస్టారర్ ఇదే కావడం విశేషం. -
దసరా వచ్చిందంటే.. సినిమా పండగే..
-
జోరు మీదున్న ఎన్టీఆర్!
‘అమ్మ తోడు అడ్డంగా నరుకుతా’... అంటూ ‘ఆది’లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడిప్పుడే విన్నట్టుగా ఉంది. కానీ, కాలం వేగంగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా విడుదలై పదేళ్లకు పైనే అయ్యింది. అప్పట్లో ఎన్టీఆర్, బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో ఇదో సంచలనాత్మక చిత్రం. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోంది. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఎన్టీఆర్, విలన్ బృందం పాల్గొనగా ఓ ఫైట్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రారంభదశ నుంచీ ‘రభస’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారనే వార్త వచ్చింది. ఆ టైటిల్‌ని ఖరారు చేయలేదని చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ‘జోరు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘రభస’ కన్నా ‘జోరు’ బాగుందని ఎన్టీఆర్ కూడా భావిస్తున్నారట. టైటిల్ సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ఫైట్‌లో మాత్రం ఎన్టీఆర్ జోరుగా, హుషారుగా పాల్గొంటున్నారట. ఈ చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. -
ఎన్టీఆర్‌తో కలిసి రభస చేస్తోందట
ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, శకుని... బెంగళూరు భామ ప్రణీత నటించిన ఈ మూడు సినిమాలూ పరాజయాల్ని మూట కట్టుకున్నాయి. దాంతో ‘ఐరన్‌లెగ్’ అనే పదం మొన్నటివరకూ ప్రణీత ఇంటిపేరై కూర్చుంది. అయితే... ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు.. ‘అత్తారింటికి దారేది’ అనే ఒకే ఒక్క సినిమా ప్రణీత తలరాతనే మార్చేసింది. నిజానికి ఈ సినిమాలో ప్రణీత చేసింది సెకండ్ హీరోయిన్ కేరక్టర్. కానీ ప్రధాన కథానాయిక సమంత కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది ప్రణీత. ఒక్క విజయంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ప్రణీత జపం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే... మరో ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రణీతకు అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకునిగా ‘కంది రీగ’ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ‘రభస’ చిత్రంలో ఓ కథానాయికగా ప్రణీతను ఎంపిక చేశారు. అయితే... ఈ సినిమాలో కూడా ప్రధాన కథానాయిక సమంతానే కావడం విశేషం. ‘అత్తారింటికి దారేది’ తర్వాత సమంత, ప్రణీత కలిసి నటిస్తున్న సినిమా ఇదే. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రం ‘అత్తారింటికి దారేది’ ఫీట్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.