'రాకాసి..రాకాసి' అంటున్న జూనియర్ ఎన్టీఆర్!
యమదొంగ, కంత్రి చిత్రాలతో తన గళంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరోసారి గాయకుడిగా మారారు. తర్వలో విడుదల కానున్న రభస చిత్ర కోసం రాకాసి.. రాకాసి అంటూ జూనియర్ ఎన్టీఆర్ పాట పాడారని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రభస చిత్రం కోసం పాట పాడారు. పాట పేరు రాకాసి.. రాకాసి. త్వరలో రభస ఆడియో విడుదల కానుంది అంటూ తమన్ ట్విటర్ లో వెల్లడించారు.
సమంత, ప్రణీత లు ఎన్టీఆర్ కు జంటగా నటిస్తున్న రభస చిత్రానికి 'కందిరీగ' సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్, ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత బెల్లంకొండ సురేష్.
(ఇంగ్లీషు కథనం కోసం క్లిక్ చేయండి)