'రభస వాయిదాపై ఎన్టీఆర్ గరం?
'రభస వాయిదాపై ఎన్టీఆర్ గరం?
Published Wed, Aug 6 2014 5:05 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
'రభస' చిత్రం వాయిదా వేయడంపై నిర్మాతపై జూనియర్ ఎన్టీఆర్ గుర్రుగా ఉన్నట్టు ఫిలింనగర్ సమాచారం. వాస్తవానికి రభస చిత్రం ఆగస్టు 15 తేదిన విడుదల కావాల్సి ఉంది. అయితే తన కుమారుడు నటించిన 'అల్లుడు శీను' చిత్రం బిజినెస్ బాగా ఉండటం కారణంగా నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పరిశ్రమకు చెందిన వారు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
అల్లుడు శ్రీను బిజినెస్ ఇంకా మంచి ఊపులోనే ఉంటటం వలన రభస చిత్రాన్ని వాయిదా వేయాలని బయ్యర్లు కోరినట్టు తెలుస్తోంది. అందుకే 'రభస' విడుదల ఆగస్తు 28 తేదికి వాయిదా వేశారని అంటున్నారు. రభస వాయిదా వేయడంపై జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆగస్టు 15 తేదిన సూర్య నటించిన 'సికిందర్' విడుదలవుతున్న కారణంగా నిర్మాత జాగ్రత్త పడినట్టు తెలిసింది. సికిందర్ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
'రభస' చిత్రం కోసం ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ అభిమానులు కూడా కొంత నిరుత్సాహం చెందినట్టు సమాచారం. సమంత, ప్రణీత హీరొయిన్లుగా నటిస్తున్న రభస చిత్రానికి కందిరీగ 'ఫేం' సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
Advertisement
Advertisement