రామ్ కొత్త సినిమా మొదలైంది
రామ్ కొత్త సినిమా మొదలైంది
Published Sat, Apr 9 2016 11:57 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
నేను శైలజ సినిమాతో ఈ ఏడాది మొదట్లోనే సూపర్ హిట్ కొట్టిన రామ్, ఆ తరువాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనలోనే ఇన్ని రోజులు కాలం గడుపుతూ వచ్చాడు. గతంలో రోటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన రామ్, ఒకే తరహా పాత్రలు చేయటంతో ఆకట్టుకోలేకపోయాడు. మూస పాత్రలతో వరుస ఫ్లాప్లు ఎదురకావటంతో కొత్త తరహా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
నేను శైలజ సినిమాతో తన ఒరిజినల్ ఎనర్జీకి భిన్నంగా సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న రామ్ మంచి విజయాన్ని సాధించాడు. ఈ సినిమా తరువాత మరోసారి ప్రయోగం చేయాలా..? లేక, మాస్ సినిమాకే ఓటేయ్యాలా..? తేల్చుకోలేక దాదాపు మూడు నెలలుగా కాలీగానే ఉంటున్నాడు. ఫైనల్గా ఓ నిర్ణయానికి వచ్చిన రామ్, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు.
రామ్ హీరోగా తెరకెక్కిన కందిరీగ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్, వెంటనే రామ్ హీరోగా మరో సినిమా చేయడానికి ప్రయత్నించాడు. అయితే అది వర్క్ అవుట్ కాకపోవటంతో ఎన్టీఆర్ హీరోగా రభస సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా డిజాస్టర్ కావటంతో ఇంతకాలం కాలీగా ఉన్న ఈ యువ దర్శకుడు ప్రస్తుతం పక్కా స్క్రీప్ట్తో రామ్ను మెప్పించాడు. ఉగాది సందర్భంగా ప్రారంభమైన రామ్, సంతోష్ శ్రీనివాస్ల కొత్త సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది.
Advertisement
Advertisement