nenu sailaja
-
సుప్రీం హీరో రెడీ టు షూట్..!
మెగా వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. ముఖ్యంగా నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్యు సినిమాల్లో సాయి లుక్‌పై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఆలోచనలో పడ్డా సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రాన్ని ప్రారంభించడానికి గ్యాప్ తీసుకున్నాడు. కొద్ది రోజులుగా అమెరికాలో ఉంటూ సరికొత్త లుక్‌లోకి మారే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్‌లో రెడీ అయిపోయాడట. ఫిట్ బాడీతో పాటు డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో రెడీ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్‌లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందించనున్నారు. -
కిశోర్కే ఓటేసిన రామ్
నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో రామ్ హైపర్ తరువాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. హైపర్ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ మీద కన్నేశాడు రామ్. అందుకే మరోసారి నేను శైలజ కాంబినేషన్ నే రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ముందు అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయాలని భావించినా.. ఇప్పుడే ప్రయోగం చేయటం ఇష్టం లేని రామ్ సేఫ్ గేమ్ కే మొగ్గుచూపుతున్నాడు. అయితే తాజాగా ఈ ఎనర్జిటిక్ హీరో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. నేను శైలజ లాంటి సినిమాతో తన కెరీర్‌కు కిక్ ఇచ్చిన, కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. నేను శైలజ తరువాత వెంకటేష్ హీరోగా ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు రామ్. ఆ సినిమా ఆగిపోవటంతో రామ్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాశాడు. రామ్ హోం బ్యానర్ స్రవంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
టెన్షన్ పెట్టకు తమ్ముడు : హీరో రామ్
నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన యంగ్ హీరో రామ్, తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాతో పాటు ప్రైవేట్ పార్టీస్ లో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న రామ్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఓ అభిమాని రామ్.., నెక్ట్స్ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు ఉపవాసం చేస్తున్నానంటూ రామ్ కు ట్విట్టర్ లో మెసేజ్ చేశాడు. ' రామ్ అన్నయ్య, ఈ రోజు నుంచి మీ నెక్ట్స్ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఉపవాసం చేస్తున్నాను. ఇది మొదటి రోజు లవ్ యు' అంటూ తరుణ్ సాయి ప్రకాష్ అనే అభిమాని ట్వీట్ చేశాడు. ఈ ట్విట్ పై స్పందించిన రామ్, ' ఇలాంటి కొత్త టెన్షన్స్ పెట్టకు తమ్ముడు, నేను అదే పనిలో ఉన్నా' అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు రామ్. @ramsayz annaya iam going to start fasting from 2day onwards till we get an announcement of ur nxt project iam saying it for sure DAY1 loveU — tarun_sai_prakash (@starun01) 21 February 2017 Illanti kotha tensions pettaku thammudu..im on it #love https://t.co/G1xbMUXXIB — Ram Pothineni (@ramsayz) 21 February 2017 -
రిస్క్ వద్దనుకుంటున్న రామ్
నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న యంగ్ హీరో రామ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా రిస్క్ చేయకూడదనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే అనీల్ రావిపూడి చెప్పిన గుడ్డివాడి పాత్రకు నో చెప్పిన రామ్.., లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అది కూడా సక్సెస్ ట్రాక్‌లో ఉన్న టీంతోనే కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకే గతంలో ఎనౌన్స్ చేసిన కరుణాకరణ్ సినిమాను కూడా కాదని ముందుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. నేను శైలజ సినిమాతో రామ్ కెరీర్‌ను మలుపు తిప్పిన కిశోర్ తిరుమల, ఆ తరువాత వెంకటేష్ హీరోగా ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేయాల్సి ఉంది.. అయితే ఈ సినిమా ఆలస్యమవుతుండటంతో ఈ గ్యాప్‌లో రామ్‌తో సినిమాను పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నాడు కిశోర్. -
కొంచెం ఇష్టం...కొంచెం కష్టం వల్లే: హిమజ
బుల్లితెరలో కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం పెద్దతెరలో దూసుకుపోతున్న హిమజ.. అచ్చమైన తెలుగుదనంతో అనతి కాలంలోనే తనకంటూ ఓ ట్రేడ్‌మార్క్‌ని సంపాదించుకుంది. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పొందిన ఆమె... ‘నేను.. శైలజ, శివం, జనతాగ్యారేజ్, ధృవ..’ ఇలా వరుస విజయాలు సాధించిన సినిమాల్లో నటించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘శతమానం భవతి’ సినిమాలో పల్లెటూరి కొంటెపిల్లగా ప్రేక్షకులను అలరించింది ఈ అమ్మడు. ఈ చిత్రంలో సుబ్బలక్ష్మి పాత్రలో హార్ట్ టచ్చింగ్‌గా నటించింది. నేపథ్యంలో సంక్రాంతి పండగ, సినిమా విశేషాలను హిమజ ‘సాక్షి’తో పంచుకుంది.. నేను పుట్టింది విజయవాడలో అయినా, పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. చిన్నప్పటి నుంచి అల్లరి పిల్లగా పెరిగాను. చదువుతోపాటు ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేదాన్ని. నాకు పల్లె‘టూర్’ అంటే ఎంతో ఇష్టం. అమ్మమ్మ చేతి వంటలంటే ఇంకా ఇష్టం. ప్రతి సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి స్నేహితులతో కలిసి పతంగులు ఎగిరేస్తూ.. రంగవల్లులు పరిశీలిస్తూ.. అమ్మమ్మ పిండివంటలు ఎంజాయ్ చేసేదానిని. పండగకి విడుదలైన కొత్త సినిమాలను వరుసగా మూడు రోజుల్లో మూడు చూసేసి సరదాగా గడిపేవాళ్లం. చెప్పాలంటే నేనొక పెద్ద ఫుడ్డీని. హోమ్ ఫుడ్‌నే ఎక్కువగా ఇష్టపడతాను. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ మూడేళ్లలో సంక్రాంతిని ఎంజాయ్ చేయడం కుదరలేదు. ‘శతమానం భవతి’ సినిమాలో నటించే అవకాశం రావడంతో పల్లెలన్నీ చుట్టేశాను. చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా పండగ వాతావరణాన్ని ఆస్వాదించాను. ఈ సినిమాతో ఒక నిండైన సంక్రాంతి పండగను ఎంజాయ్ చేశాను. నాకు అమ్మానాన్న సపోర్టు చాలా ఉంది. వాళ్ల వల్లే నేను ఈ స్థాయికి వచ్చారు. అలాగే ఇండస్ట్రీలో ఎవరూ తెలిసినవాళ్లు లేకపోయినా స్వశక్తితో పైకి వచ్చాను. ఇక గాసిప్స్ అంటే... రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఇవి కూడా అంతే. నా వరకూ నేను ఫర్ఫెక్ట్గా ఉంటా అని హిమజ చెప్పుకొచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు చిన్న సినిమాల్లోనే స్కోప్ ఉంటుందని, ప్రతి క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటించాలని ఉంటుందని, అయితే డేట్స్ సమస్య వల్లే నటించలేకపోతున్నట్లు హిమజ తెలిపింది. కొంచెం ఇష్టం...కొంచెం కష్టం సీరియల్ తన కెరీయర్ కు ప్లస్ అయినట్లు చెప్పింది. -
'నేను శైలజ' కాంబినేషన్లో మరో మూవీ
నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో రామ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో హైపర్ సినిమాను పూర్తి చేసిన రామ్ ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్‌కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా ఈ ఎనర్జిటిక్ హీరో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. నేను శైలజ లాంటి సినిమాతో తన కెరీర్‌కు కిక్ ఇచ్చిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే వెంకటేష్‌తో సినిమా కమిట్ అయిన కిశోర్, రామ్‌తో సినిమాను మొదలెట్టడానికి కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది. మరి ఈ గ్యాప్ లో రామ్ మరో సినిమా చేస్తాడేమో చూడాలి. -
క్రేజీ ఫీలింగ్‌కు కోటి వ్యూస్
2016కు బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో స్వాగతం పలికిన టాలీవుడ్ స్టార్ రామ్. చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఎనర్జిటిక్ హీరో.. నేను శైలజ సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మళయాలి బ్యూటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. సినిమా రిలీజ్‌కు ముందు నుంచే హిట్ టాక్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా ఆడియో, రిలీజ్ తరువాత మరింతగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇప్పటికీ చాలా ఫోన్లకు రింగ్ టోన్స్గా వినిపిస్తున్నాయి నేను శైలజ సాంగ్స్. ముఖ్యంగా ప్రేమ పడ్డ యువకుడి మనసు తెలియజేస్తూ రామజోగయ్య శాస్త్రీ రాసిన క్రేజీ క్రేజీ ఫీలింగ్ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది. నాలుగు నెలల క్రితం క్రేజీ ఫీలింగ్ ఫుల్ వీడియో సాంగ్ కొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ పాటను కోటి మందికి పైగా ఆన్ లైన్ లోచూశారు. ఈ ఆనందాన్ని తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్న హీరో రామ్ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, రచయిత రామజోగయ్య శాస్త్రీ, దర్శకుడు కిశోర్‌లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. And it's 10million+ views for #crazyfeeling on YouTube..thank u @ThisIsDSP @ramjowrites & Kishore .. #nenusailaja pic.twitter.com/cn8LU8CHLF — Ram Pothineni (@ramsayz) 8 July 2016 -
ఫుల్ బిజీగా ఎనర్జిటిక్ హీరో
నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న రామ్ మరో మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. నేను శైలజ తరువాత ఏ తరహా కథ చేయాలో అర్ధం కాక చాలా రోజులు పాటు ఖాళీగానే ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ సినిమా పూర్తవ్వగానే పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఆ తరువాత మరోసారి నేను శైలజతో తన బ్రేక్ ఇచ్చిన కిశోర్ తిరుమలతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. ఒక్కో సినిమాకు నాలుగు నెలల సమయం పట్టినా.. కనీసం మరో ఏడాదిన్నర పాటు రామ్ యమ బిజీగా గడపనున్నాడు. -
అంధుడిగా యంగ్ హీరో
నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్, ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరింఛి వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్, తరువాతి సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. నేను శైలజ తరువాత కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేసిన రామ్, వరుసగా రెండు సినిమాలకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు తన తర్వాతి సినిమాలో ఓ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న రామ్, మాస్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకుంటున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను అంగీకరించాడు. కామెడీ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమాలు తెరకెక్కించే అనిల్, రామ్ కోసం ఎనర్జిటిక్ స్టోరీని రెడీ చేశాడట. అయితే ఈ సినిమాలో రామ్ అంధుడి పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించాడు. అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన సుప్రీమ్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తన తదుపరి సినిమాను ప్రకటించాడు. రామ్ హీరోగా తన సినిమా ఉంటుదన్న అనిల్, ఆ సినిమాలో హీరో పాత్ర ‘అంధుడు’ అంటూ షాక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు ప్రయోగాలకు పెద్దగా ఇష్టపడని రామ్ తొలిసారిగా చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
నానితో శైలజ
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. స్టార్ వారసులిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త ఇబ్బంది పడినా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ టాలీవుడ్లో మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతోంది. టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకున్న నానికి జోడీగా నటించనుంది కీర్తి. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెంటిల్‌మేన్ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్తా మామ ఫేం త్రినాథ్ రావ్ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకం. అందుకే గ్లామర్‌తో పాటు నటిగా కూడా మంచి మార్కులు సాధించిన కీర్తి సురేష్‌ను ఈ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. నేచురల్ స్టార్‌గా మంచి ఇమేజ్ ఉన్న నానితో కలిసి నటించడానికి కీర్తి సురేష్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
పవన్‌కు నో చెప్పిన హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే స్టార్ హీరోయిన్లు కూడా నో చెప్పారు. అలాంటిది ఓ యంగ్ హీరోయిన్ పవన్ సినిమాలో ఛాన్స్ ఇస్తామంటే సారీ... డేట్స్ ఖాలీల్లేవంటోంది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కీర్తీసురేష్. ఆ సినిమా సక్సెస్‌తో వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మళయాల ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ తెలుగు, తమిళ భాషల్లో కూడా బిజీ అవుతోంది. ప్రస్తుతం ఎస్‌జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా కీర్తి సురేష్ అయితే బాగుంటుందని భావించారు. అయితే అదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం రావటంతో పవర్ స్టార్‌కు నో చెప్పేసింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు ఒకేసారి డేట్స్ అడ్జస్ట్ చేయటం కుదరదన్న ఆలోచనతో పవన్ సినిమాను వదులుకుంది కీర్తీ సురేష్. -
రిస్క్ చేస్తున్న రామ్
చాలా కాలం తర్వాత ఇటీవల 'నేను శైలజ' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రామ్. ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చినా.. నెక్ట్స్ సినిమాల విషయంలో రిస్క్ చేస్తున్నాడు. ఇప్పటికే తనకు కందిరీగ లాంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టాడు. అయితే కందిరీగ తరువాత రభస లాంటి భారీ ఫ్లాప్ ఇచ్చిన సంతోష్‌తో రామ్ సినిమా చేయటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ సినిమా తరువాత కూడా మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్. గతంలో రామ్ హీరోగా 'ఎందుకంటే ప్రేమంట' లాంటి ఫ్లాప్ సినిమాను తెరకెక్కించిన కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. లవ్ స్టోరీస్ తెరకెక్కించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న కరుణాకరన్ రామ్ కోసం ఓ క్యూట్ లవ్ స్టోరీని రెడీ చేస్తున్నాడట. మరి రామ్ చేస్తున్న ఈ రిస్క్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. -
రామ్ కొత్త సినిమా మొదలైంది
నేను శైలజ సినిమాతో ఈ ఏడాది మొదట్లోనే సూపర్ హిట్ కొట్టిన రామ్, ఆ తరువాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనలోనే ఇన్ని రోజులు కాలం గడుపుతూ వచ్చాడు. గతంలో రోటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన రామ్, ఒకే తరహా పాత్రలు చేయటంతో ఆకట్టుకోలేకపోయాడు. మూస పాత్రలతో వరుస ఫ్లాప్‌లు ఎదురకావటంతో కొత్త తరహా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. నేను శైలజ సినిమాతో తన ఒరిజినల్ ఎనర్జీకి భిన్నంగా సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న రామ్ మంచి విజయాన్ని సాధించాడు. ఈ సినిమా తరువాత మరోసారి ప్రయోగం చేయాలా..? లేక, మాస్ సినిమాకే ఓటేయ్యాలా..? తేల్చుకోలేక దాదాపు మూడు నెలలుగా కాలీగానే ఉంటున్నాడు. ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చిన రామ్, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు. రామ్ హీరోగా తెరకెక్కిన కందిరీగ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్, వెంటనే రామ్ హీరోగా మరో సినిమా చేయడానికి ప్రయత్నించాడు. అయితే అది వర్క్ అవుట్ కాకపోవటంతో ఎన్టీఆర్ హీరోగా రభస సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా డిజాస్టర్ కావటంతో ఇంతకాలం కాలీగా ఉన్న ఈ యువ దర్శకుడు ప్రస్తుతం పక్కా స్క్రీప్ట్‌తో రామ్‌ను మెప్పించాడు. ఉగాది సందర్భంగా ప్రారంభమైన రామ్, సంతోష్ శ్రీనివాస్‌ల కొత్త సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. -
కోలీవుడ్ స్టార్ హీరోతో శైలజ
నేను శైలజ సినిమాతో టాలీవుడ్లో సత్తా చాటిన మళయాలి భామ కీర్తీ సురేష్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం తేరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న తమిళ స్టార్ హీరో విజయ్, నెక్ట్స్ సినిమాలో కీర్తిని హీరోయిన్గా ఫైనల్ చేశారు. ఏప్రిల్ వరకు తేరి షూటింగ్ కొనసాగుతుండటంతో మేలో విజయ్, కీర్తిల కాంబినేషన్లో సినిమా ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన నటించని కీర్తీ సురేష్‌కు ఇది క్రేజీ ఆఫరే అంటున్నారు సినీ ప్రముఖులు. భరతన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముందుగా కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. గతంలో కాజల్, విజయ్‌ల కాంభినేషన్లో వచ్చిన తుపాకి ఘన విజయం సాధించటంతో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావించారు. కానీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన రజనీ మురుగన్ సినిమాతో కీర్తీ సురేష్ తమిళనాట మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో కాజల్‌ను కాదని కీర్తినే ఈ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. -
'నేను శైలజ నా చివరి సినిమా'
ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన స్టార్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ ఇక పై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ప్రేమంట, మసాల, శివమ్ లాంటి డిజాస్టర్ల తరువాత నేను శైలజ సినిమాతో మంచి విజయం సాధించిన స్రవంతి రవికిశోర్, ఈ సినిమా సక్సెస్ మీట్‌తో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక పై తాను నిర్మాణ రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నానని తెలిపారు. స్రవంతి రవికిశోర్ నిర్మాణ రంగం నుంచి తప్పుకున్నా.. స్రవంతి మూవీస్ బ్యానర్ మాత్రం కొనసాగుతుందని తెలిపారు. రామ్ సోదరుడు కృష్ణ చైతన్య ఇక పై ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. త్వరలోనే నేను శైలజ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన హీరో రామ్, డైరెక్టర్ కిశోర్ తిరుమలల కాంబినేషన్లో మరో సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు, ఈ సినిమాతోనే కృష్ణ చైతన్య నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. -
హీరో రామ్‌కి ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా ....
మంగళంపల్లి శ్రీసత్య.. విజయవాడ వాసులకు సుపరిచితమైన పేరు. గత ఏప్రిల్‌లో జరిగిన అందాల పోటీల్లో మిస్ విజయవాడగా గెలుపొందిన పదహారణాల తెలుగమ్మాయి. చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే ఇష్టం ఉన్న శ్రీసత్య ఇటీవల విడుదలైన ‘నేను శైలజ’ చిత్రంలో హీరోకి ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా చిన్నపాత్ర వేసి, వెండితెర నటనకు తెరతీసింది. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన శ్రీసత్య ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ . సాక్షి : నేను శైలజ సినిమాలో మీ పాత్ర గురించి... శ్రీసత్య : ఈ చిత్రంలో హీరో రామ్‌కు ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించాను. నా పాత్ర చాలా చిన్నది. కానీ, పెద్ద బ్యానర్లో నా తెరంగేట్రం జరగడం ఆనందంగా ఉంది. సాక్షి : ఏం చదువుతున్నారు? శ్రీసత్య : సిద్ధార్థ కళాశాలలో బీబీఎం మొదటి సంవత్సరం చదువుతున్నాను. సాక్షి : మిస్ విజయవాడ కాంటెస్ట్‌లో పాల్గొనడం గురించి... శ్రీసత్య : ప్లస్ టూ అయ్యాక మిస్ విజయవాడ కాంటెస్ట్ పెడుతున్నారని తెలిసి పాల్గొన్నాను. అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్. మొత్తం 300 మందిలో ఫస్ట్ వచ్చాను. సాక్షి : సెలక్షన్ విధానం ఎలా ఉంటుంది? శ్రీసత్య : క్యాట్‌వాక్ చేయమంటారు. ఆ తరువాత కొన్ని ప్రశ్నలు వేశారు. ఇందులో చీర, షార్ట్, ఫ్యాన్సీ మూడు రకాల డ్రెస్‌లు వేసుకుంటాం. సాక్షి : మిస్ విజయవాడగా మిమ్మల్ని నిలబెట్టిన ప్రశ్న? శ్రీసత్య : అమ్మ కావాలా? నాన్న కావాలా? దేశం కావాలా? అని అడిగారు. వాళ్లు అడిగే ప్రశ్నలోనే సమాధానం ఉంటుందని మాకు శిక్షణలో నేర్పారు. నేను జాగ్రత్తగా ఆలోచించి ‘దేశం కావాలి’ అన్నాను. ఎందుకని ప్రశ్నించారు. ‘ఆ మట్టి ఉంటేనే కదా అమ్మ, నేను, నాన్న ఉంటాం’ అన్నాను. నా సమాధానం వారికి నచ్చింది. ‘మిస్ విజయవాడకు ఎందుకు వచ్చావు?’ అని అడిగారు. ‘ఇంట్రస్ట్‌తో వచ్చాను, గెలుస్తానని నమ్మకంతో ఉన్నాను.’ అన్నాను. దాంతో నన్ను సెలక్ట్ చేశారు. సాక్షి : శిక్షణ ఎలా ఉంటుంది? శ్రీసత్య : తెలుగు పరిశ్రమ నుంచి మోడల్ ట్రెయినర్ వచ్చి పర్ఫెక్ట్ వాక్ నేర్పుతారు. స్టేజీ మీద భయపడకుండా మాట్లాడటంలో శిక్షణ ఇస్తారు. అవి మాకు బాగా ఉపయోగపడతాయి. సాక్షి : మోడలింగ్ రంగంలోకి ఎలా ప్రవేశించారు? శ్రీసత్య : నాకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఇష్టం. పదో తరగతి చదువుకునే రోజుల్లో యానివర్సరీకి స్టేజీ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఫేర్‌వెల్‌లో కూడా.. సాక్షి : చదువును ఎలా బ్యాలె న్స్ చేసుకుంటున్నారు? శ్రీసత్య : కాలేజీ వారు సహకరిస్తున్నారు. ప్రతి క్లాసులోనూ 89 శాతం మార్కులు వచ్చాయి. అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సాక్షి : ఎటువంటి పాత్రలంటే ఇష్టం.. శ్రీసత్య : ట్రెడిషనల్ క్యారెక్టర్సంటే ఇష్టం. నటనపరంగా ఏదైనా చేస్తాను. మంచి మెసేజ్ ఉండే ఏ చిత్రమైనా ఇష్టమే. విజయవాడలో ఎక్కువగా మోడలింగ్ చేశాను. అమెజాన్ వాళ్ల మోడలింగ్‌కి సెలక్ట్ అయ్యాను. జనవరి 31న జరగబోయే ‘మిస్ ఆంధ్రప్రదేశ్’ కి ఎంపికయ్యాను. సాక్షి : ఇంతవరకు చేసిన సేవా కార్యక్రమాలు.. శ్రీసత్య : రోటరీ క్లబ్ కార్యక్రమాల్లో నన్ను ప్రతిసారీ అతిథిగా పిలుస్తారు. ఆడపిల్లల రక్షణ కోసం పోలీసు వారు రూపొందించిన యాప్ పబ్లిసిటీలో పాల్గొన్నాను. స్వచ్ఛభారత్‌లో పాల్గొన్నాను. ‘మార్క్’ వారు నిర్వహిస్తున్న అనాథాశ్రమాలను సందర్శించాను. ఇద్దరు భార్యాభర్తలు స్వచ్ఛందంగా నడుపుతున్న పిచ్చివారి అనాథాశ్రమం కూడా చూశాను. సాక్షి : ఆనందం కలిగించిన అంశాలు.. శ్రీసత్య : ‘బజ్’ మ్యాగజైన్ వారు నా ఫొటోను కవర్ పేజీలో వేయడం నన్ను బాగా ఆనందింపజేసింది. డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యాను. ప్రస్తుతం ‘గోదారి నవ్వింది’ సినిమా చేస్తున్నాను. షూటింగ్ పూర్తవుతోంది. ఈ చిత్రానికి నిర్మాత, డెరైక్టర్ అంతా కొత్తవారే. నేను ఇందులో హీరోయిన్గా నటిస్తున్నాను. ‘అందాల వారసుడు’ ఆఫర్ వచ్చింది. ముహూర్తం కూడా అయింది. మరో సినిమా కూడా ఓకే అయింది. ‘లవ్ స్కెచ్’ షార్ట్‌ఫిల్మ్‌లో నటించాను. ఆ అనుభవంతో నాకు సినిమాల్లో చేయడం సులువైంది. - శ్రీసత్య -
ఫ్యామిలీతో... నేను... శైలజ...
చిత్రం: ‘నేను... శైలజ’ తారాగణం: రామ్, కీర్తీ సురేశ్, సత్యరాజ్ సంగీతం: దేవిశ్రీప్రసాద్ కెమేరా: సమీర్‌రెడ్డి కళ: ఏ.ఎస్. ప్రకాష్ ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్ నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్ రచన - దర్శకత్వం: కిశోర్ తిరుమల లైఫ్‌లో చాలా ఈజీ - ప్రేమలో పడడం. కానీ, చాలా కష్టం - ఆ అమ్మాయికి ఆ మాట చెప్పడం!’ ‘నేను... శైలజ’లో హీరో ఓ సందర్భంలో కాస్త అటూ ఇటుగా ఇదే అర్థమొచ్చేలా డైలాగ్ చెబుతాడు. సినిమా కూడా అంతే! ప్రేమకథ చెప్పడం ఈజీ. కానీ, దాన్ని తెరపై అందరికీ నచ్చేలా చెప్పడం చాలా కష్టం. మంచి హిట్ కోసం చూస్తున్న హీరో రామ్, మంచి చిత్రాలను అందించడంలో ముందుండే నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సారి అలాంటి ప్రేమకథాచిత్రాన్ని తలకెత్తుకున్నారు. ఇది ‘హరి’ (రామ్) అనేవాడి ప్రేమ కథ. హరి, అతని సోదరి కీర్తి - ఇద్దరూ కవలలు. ఎవరు పెద్దో, ఎవరు చిన్నో తెలీదు కాబట్టి, ‘అక్కయ్యా’ అని అతను, ‘అన్నయ్యా’ అని ఆమె పిలుచుకొనేంత క్లోజ్. వాళ్ళ అమ్మా నాన్న (నరేశ్, ప్రగతి) పిల్లలను ప్రేమగా పెంచే టైప్. క్లబ్లో డీజేగా పనిచేస్తున్న హీరో చిన్నప్పటి నుంచి చాలామందికి ఐ లవ్యూ చెప్పి, నో అనిపించుకుం టాడు. చివరకు యాడ్ ఏజన్సీలో పనిచేస్తున్న శైలజ (కీర్తి సురేశ్) అనే అమ్మాయితో కనెక్ట్ అవుతాడు. చిన్నప్పుడు తాను ఆరాధించి, విడిపోయిన శైలూయే ఈ శైలజ అని గ్రహిస్తాడు. ఆ అమ్మాయీ అతణ్ణి ప్రేమిస్తుంది. అతనే చిన్నప్పటి తన ఉంగరం ఫ్రెండ్ అని గుర్తిస్తుంది. తీరా హీరో వాళ్ళ ప్రేమ కథ ఒక కొలిక్కి వచ్చే టైమ్‌కి, ఆ అమ్మాయికి అయిన సంబంధం కుదురుస్తారు అమ్మా నాన్న. ‘ఐ లవ్ యు.. బట్ అయామ్ నాట్ ఇన్ లవ్ విత్ యు’ అనేసి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ హీరోయిన్ అసలు కథలోకి వెళితే - ఆమె నాన్న శ్రీనివాసరావు (సత్యరాజ్). పిల్లల బంగారు భవిత కోసం కాంట్రాక్టులంటూ దేశాలు పట్టి అతను వెళితే, అమ్మ (రోహిణి) హీరోయిన్నీ, ఆమె అన్న (ప్రిన్స్)నీ జాగ్రత్తగా పెంచుతుంది. దాంతో, పిల్లల పట్ల ప్రేమ ఉన్నా చెప్పని తండ్రికీ, తన మనసులోని భావాల్ని బాహాటంగా వ్యక్తం చేయలేని కూతురిగా హీరోయిన్‌కూ మధ్య అంతరం పెరిగిపోతుంది. మరోపక్క మాట పట్టింపుతో పాతికేళ్ళ క్రితం శ్రీనివాసరావు తన తండ్రికీ, చెల్లికీ దూరమవుతాడు. తీరా చెల్లెలే వచ్చి తన కొడుక్కి (చైతన్య కృష్ణ), హీరోయిన్ని ఇచ్చి చేసి, కుటుంబాలు దగ్గరవుదామంటుంది. ఈ ఫ్యామిలీ ట్విస్ట్ వల్లే హీరో యిన్ దూరమైందని గ్రహించిన హీరోకు- హీరోయిన్ అన్న, తన అక్క ప్రేమించుకుంటున్నారని తెలుస్తుంది. ఇంకేం... పెళ్ళి కానున్న హీరోయిన్ ఇంటికి వెళతాడు. అక్కడ హీరో ఏం చేశాడన్నది మిగతా సినిమా. ఎక్కువగా మాస్ చిత్రాల్లో హుషారుగా కనిపించే రామ్ ఈ హరి పాత్ర కోసం నియంత్రణలోకొచ్చారు. ఫస్టాఫ్‌లో అక్కడక్కడ పవన్ కల్యాణ్ శైలి తొంగి చూసినా, తరువాత కుదురుకున్నారు. హీరోయిన్ కీర్తీ సురేశ్ తెలుగుకు కొత్త. కాబట్టి, చూడగానే గుర్తుపట్టడం కానీ, గుర్తుపెట్టుకొనే నటన ఆశించడం కానీ అత్యాశ. హీరోయిన్ తండ్రి పాత్రలో సత్యరాజ్‌కు డైలాగులు తక్కువ. ముఖంలోనే చూపాల్సిన హావభావాలెక్కువ. రోహిణి, నరేశ్, ప్రగతి లాంటి అనుభవజ్ఞులు ఎలాగూ ఉన్నారు. బాల తారలతో బాగా నటింపజేశారు. దర్శక, రచయిత తిరుమల కిశోర్ డైలాగుల్లో రచయితగా తన బలాన్ని మరోసారి చూపించారు. కొన్ని డైలాగులు నవ్విస్తాయి. కొన్ని గుర్తుండిపోతాయి. ‘ఎరేంజ్డ్ మ్యారేజ్ అంటే... సిస్టమ్‌లో సినిమా చూడడం లాంటిది. లవ్ మ్యారేజ్ అంటే థియేటర్లో సినిమా చూడడం లాంటిది. సినిమా ఒకటే అయినా, ఫీల్‌లో తేడా ఉంటుంది’ లాంటివి యూత్‌కు నచ్చుతాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పాటలు, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ కలిసొచ్చే అంశాలు. దేవిశ్రీ తరహా క్లబ్ గీతం ‘నైట్ ఈజ్ స్టిల్ యంగ్...’ (రచన సాగర్) సరదాగా అనిపిస్తుంది. ‘ఇఫ్ యు గో టు హెల్ యముడేమో థ్రిల్’ లాంటి ఎక్స్ప్రెషన్స్ కొత్తనిపిస్తాయి. నేపథ్యసంగీతం కొన్ని సీన్లకు ఉత్తేజమిచ్చి, సెకండాఫ్‌లో ఒక దశ దాటాక పాత రికార్డేదో పదేపదే విన్నట్లుంది. ఫస్టాఫ్ అందమైన ప్రేమ క్షణాలతో, యూత్‌ఫుల్‌గా అనిపిస్తూ, చిరునవ్వులు విరబూయిస్తూ సాగుతుంది. కీలక మలుపు తిరిగిన హీరో హీరోయిన్ల ప్రేమకథకు సెకండాఫ్‌లో కన్‌క్లూజన్ చెప్పే క్రమంలో ‘మనసంతా నువ్వే’, ‘నువ్వే నువ్వే’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ దాకా సినిమాలు, వాటి ఫీల్ గుర్తుకొస్తాయి. నిజానికిది రెండుంబావు గంటల పైచిలుకు వ్యవధి సినిమానే. కానీ, సెంటిమెంట్ సీన్ల బరువుతో సెకండాఫ్ భారంగా గడుస్తుంది. అయితే, క్లైమాక్స్‌కు ముందు హీరోతో సత్యరాజ్ మాటలు, సత్యరాజ్‌తో హీరోయిన్ మాట్లాడే మాటలు కీలకం. అలాంటి ఘట్టాలు కొన్ని ఉంటే, సినిమా పట్టు పెరిగేది. ప్రేమలో విఫలమైన రౌడీగా మహర్షి పాత్రను విలన్ ప్రదీప్ రావత్‌తో వేయించడం వెరైటీ. ఒకప్పుడు స్వర్గీయ శ్రీహరికి నప్పే ఈ పాత్రను ఇంకా వాడుకోగలిగితే, కామెడీ కలిసొచ్చేది. ఆల్రెడీ పెళ్ళి కుదిరిన హీరోయిన్. ఆమెను ప్రేమిం చిన హీరో. హీరోయిన్ ఇంటికే హీరో వచ్చి, ఆమె ఇంట్లో వాళ్ళను ఇంప్రెస్ చేసి, తమ ప్రేమని పెళ్ళిపీటలకెక్కించ డం - ఈ బాక్సాఫీస్ ఫార్ములా మనకు కామనే. ‘నేను శైలజ’ కున్న బలమూ, బలహీనత కూడా అదే! అందుకే, ఒక ప్రముఖ సినీ రచయిత ఆ మధ్య ఆంతరంగికంగా అన్నట్లు, మన వరకు ‘దిల్వాలే దుల్హనియా’ ఒకసారి కాదు... ‘బార్.. బార్... లే జాయేంగే’! ఈ ఫ్యామిలీ ఫిల్మ్ దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్. - రెంటాల జయదేవ -
'నేను శైలజ' మూవీ రివ్యూ
టైటిల్: నేను శైలజ జానర్: రొమాంటిక్ లవ్ స్టోరీ తారాగణం: రామ్, కీర్తి సురేష్, సత్యరాజ్, ప్రదీప్ రావత్ సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం: కిశోర్ తిరుమల నిర్మాత: శ్రీ స్రవంతి మూవీస్ చాలా రోజులుగా రొటీన్ సినిమాలతో బోర్ కొట్టిస్తున్న రామ్... రూట్ మార్చి తెరకెక్కించిన సినిమా నేను శైలజ. తన హై ఓల్టేజ్ ఎనర్జీకి భిన్నంగా కాస్త సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు రామ్. తమ సొంత నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై సెకండ్ హ్యాండ్ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన నేను శైలజ, రామ్‌ను రొటీన్ హీరో అన్న ఇమేజ్ నుంచి బయటికి తీసుకువస్తుందా.. చాలా రోజలుగా ఓ భారీ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కోరిక తీరుస్తుందా..? కథ : హరి (రామ్), శైలజ (కీర్తీ సురేష్)ల చిన్నతనంలో సినిమా ప్రారంభమవుతుంది. చిన్నతనంలో ఈ ఇద్దరు స్నేహితులు. అప్పటి నుంచే శైలజ మీద ఎంతో ఇష్టం ఉన్నా, ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచిపెడతాడు. ఆ తరువాత ఎంతోమంది అమ్మాయిలకు తన ప్రేమను చెప్పినా.. ఎక్కడా వర్కవుట్ కాదు. దీంతో ప్రేమ మీద విరక్తి చెందిన హరి అమ్మాయిలకు దూరంగా ఉంటుంటాడు. హరి కుటుంబం వైజాగ్ వెళ్లిపోతుంది. హరి, శైలజ పెద్దవాళ్లవుతారు. అక్కడే ఓ పబ్‌లో డిజెగా పనిచేస్తుంటాడు హరి. వైజాగ్‌లో హ్యాపీగా గడిపేస్తున్న హరికి మళ్లీ శైలజ కనిపిస్తుంది. అయితే ఆమె తన చిన్ననాటి స్నేహితురాలు అని గుర్తించని హరి, మరోసారి ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తన గత అనుభవాల దృష్ట్యా ఆమెకు తన ప్రేమను చెప్పకుండా చాలా కాలం దాచి పెట్టి ఆమెతో స్నేహం చేస్తాడు. ఫైనల్‌గా ఓ రోజు వాళ్ల గతం గురించి తెలిసిపోతుంది. హరి, శైలజకు తన ప్రేమిస్తున్న విషయం చెపుతాడు. అప్పుడు శైలజ, హరి ప్రేమను అంగీకరించిందా.. తరువాత పరిణామాలేంటి అన్నదే మిగతా కథ. నటీనటులు: ఇప్పటివరకు ఎనర్జిటిక్ రోల్స్‌లో హై ఓల్టేజ్ నటనతో ఆకట్టుకున్న రామ్ ఈ సినిమాలో మాత్రం కాస్త సెటిల్డ్‌గా కనిపించడానికి ప్రయత్నించాడు. అందుకు తగ్గట్టుగా బాగానే హొం వర్క్ చేసినట్టున్నాడు. నటనతో పాటు డ్యాన్స్‌లలో కూడా ఎక్కడా పాత రామ్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక శైలజగా కీర్తి సురేష్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. రెగ్యులర్‌గా చేసే స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్‌కు భిన్నంగా ప్రదీప్ రావత్ కామెడీ విలనీతో మెప్పించాడు. సత్యరాజ్, విజయ్ కుమార్, నరేష్, సుడిగాలి సుధీర్‌లు ఆకట్టుకున్నారు. స్పెషల్ క్యారెక్టర్లో కనిపించిన ప్రిన్స్ అలరించాడు. సాంకేతిక నిపుణులు: సెకండ్ హ్యాండ్ లాంటి డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయిన కిశోర్ తిరుమల మరోసారి తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. రామ్‌ను కొత్తగా చూపించటంలో సక్సెస్ సాధించాడు. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్‌కు తన మ్యూజిక్‌తో కొత్త లైఫ్ ఇచ్చే దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశాడు. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. వైజాగ్ బీచ్ అందాలను అద్భుతంగా చూపించాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పరవాలేదనిపించింది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే బాగుండేది. కిశోర్ తిరుమల దర్శకుడిగానే కాక మాటల రచయితగా కూడా మెప్పించాడు. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్ తో ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. ప్లస్ పాయింట్స్ : రామ్, కీర్తీ సురేష్ కామెడీ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ : రొటీన్ నారేషన్ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ఓవరాల్‌గా నేను శైలజ, కొత్తగా కనిపించటం కోసం రామ్ చేసిన మంచి ప్రయత్నం -
‘నేను... శైలజ’ వర్కింగ్ స్టిల్స్
-
శైలజతో నేను...!
ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటాడు రామ్. ఆ ఎనర్జీ లెవల్స్‌కి తగ్గ పాత్ర దొరికితే రెచ్చిపోతాడు. పైగా, చలాకీగా, చురుగ్గా ఉండే డిస్కో జాకీ (డీజే) పాత్ర చేయమంటే ఇక, చెప్పడానికేముంటుంది? రామ్ రెచ్చిపోతాడు. తాజా చిత్రంలో అలాంటి పాత్రనే చేశారు. రామ్, కీర్తీ సురేశ్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ‘నేను...శైలజ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం హైదరాబాద్‌లో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ - ‘‘ఈ ఏడాది జనవరిలో కిశోర్ నాకీ కథ చెప్పారు. బాగా నచ్చింది. రామ్ కూడా కథ వినగానే ఇమీడియట్గా ఓకే చెప్పాడు. మా సంస్థ ఇమేజ్‌కి తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులకూ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా రూపొందింది’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ- ‘‘ఇందులో నేను డీజే పాత్ర చేశాను. అందరూ డబ్బులు తగలేయడానికి పబ్స్‌కు వెళితే, నేను మాత్రం డబ్బు సంపాదించడానికి వెళతానన్నమాట. ఇప్పటివరకూ కమర్షియల్ పంథాలో లార్జర్ దేన్ లైఫ్ రోల్స్ చేశాను. కానీ ఈ సినిమాలో రియలిస్టిక్‌గా యాక్ట్ చేశా. ఇలా చేయడం ఎంత కష్టమో తెలిసింది. మొదట ఈ చిత్రానికి ‘హరికథ’ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. కానీ సినిమా అవుట్‌పుట్ చూశాక ‘నేను...శైలజ’ యాప్ట్ అనిపించింది. నాకు సరికొత్త అనుభూతినిచ్చిన సినిమా ఇది. కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకముంది’’ అని చెప్పారు. ‘‘నా నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నా. నేను అనుకున్న విధంగా ఈ కథను తెర మీద చూపించగలిగాను. ఈ నెల 12న పాటలను, జనవరి 1న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సమర్పణ: కృష్ణ చైతన్య. -
'హరికథ' కాదు 'నేను శైలజ'
యంగ్ హీరో రామ్ మరోసారి ఆలోచనలో పడ్డాడు. రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన యంగ్ హీరో చాలా రోజులుగా ఒక్క హిట్ కూడా లేకుండా కెరీర్ నెట్టుకొస్తున్నాడు. 'పండగ చేస్కో' సినిమాతో కాస్త ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన 'శివమ్' సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. రొటీన్ కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'సెకండ్ హ్యాండ్' ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా ప్రారంభానికి ముందే ఈ సినిమాకు 'హరికథ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే రామ్ ఈ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నాడట. హరికథ అనే టైటిల్ పాతగా అనిపిస్తోందన్న ఉద్దేశంతో 'నేను శైలజ' అనే సాఫ్ట్ టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం యంగ్ హీరోలందరూ 'నాన్నకు ప్రేమతో', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అత్తారింటికి దారేది' లాంటి సాఫ్ట్ టైటిల్స్‌తో వస్తుంటే తను మాత్రం ప్రయోగం చేయటం ఎందుకు అని భావించిన రామ్, 'నేను శైలజ' టైటిల్‌కే ఫిక్స్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే చిత్రయూనిట్ ఈ టైటిల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారట.