శైలజతో నేను...! | Ram's Nenu Sailaja First Look Poster | Sakshi
Sakshi News home page

శైలజతో నేను...!

Dec 6 2015 12:00 AM | Updated on Sep 3 2017 1:33 PM

శైలజతో నేను...!

శైలజతో నేను...!

ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటాడు రామ్. ఆ ఎనర్జీ లెవల్స్‌కి తగ్గ పాత్ర దొరికితే రెచ్చిపోతాడు.

 ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటాడు రామ్. ఆ ఎనర్జీ లెవల్స్‌కి తగ్గ పాత్ర దొరికితే రెచ్చిపోతాడు. పైగా, చలాకీగా, చురుగ్గా ఉండే డిస్కో జాకీ (డీజే) పాత్ర చేయమంటే ఇక, చెప్పడానికేముంటుంది? రామ్ రెచ్చిపోతాడు. తాజా చిత్రంలో అలాంటి పాత్రనే చేశారు. రామ్, కీర్తీ సురేశ్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై  ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి  ‘నేను...శైలజ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం హైదరాబాద్‌లో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.  ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ - ‘‘ఈ ఏడాది జనవరిలో కిశోర్  నాకీ కథ చెప్పారు. బాగా నచ్చింది.
 
  రామ్ కూడా కథ వినగానే ఇమీడియట్‌గా ఓకే చెప్పాడు. మా సంస్థ ఇమేజ్‌కి తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులకూ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా రూపొందింది’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ- ‘‘ఇందులో నేను డీజే పాత్ర చేశాను. అందరూ డబ్బులు తగలేయడానికి పబ్స్‌కు వెళితే, నేను మాత్రం డబ్బు సంపాదించడానికి వెళతానన్నమాట. ఇప్పటివరకూ కమర్షియల్ పంథాలో లార్జర్ దేన్ లైఫ్ రోల్స్ చేశాను. కానీ ఈ సినిమాలో రియలిస్టిక్‌గా యాక్ట్ చేశా. ఇలా చేయడం ఎంత కష్టమో తెలిసింది. మొదట ఈ చిత్రానికి ‘హరికథ’ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం.
 
  కానీ సినిమా అవుట్‌పుట్ చూశాక ‘నేను...శైలజ’ యాప్ట్ అనిపించింది. నాకు సరికొత్త అనుభూతినిచ్చిన సినిమా ఇది. కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకముంది’’ అని చెప్పారు. ‘‘నా నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నా. నేను అనుకున్న విధంగా ఈ కథను తెర మీద చూపించగలిగాను. ఈ నెల 12న పాటలను,  జనవరి 1న  చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని  దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సమర్పణ: కృష్ణ చైతన్య.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement