క్రేజీ ఫీలింగ్కు కోటి వ్యూస్ | 1 Cr Views For Rams Crazy Feeling | Sakshi
Sakshi News home page

క్రేజీ ఫీలింగ్కు కోటి వ్యూస్

Published Sun, Jul 10 2016 9:55 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

క్రేజీ ఫీలింగ్కు కోటి వ్యూస్

క్రేజీ ఫీలింగ్కు కోటి వ్యూస్

2016కు బ్లాక్ బస్టర్ సక్సెస్తో స్వాగతం పలికిన టాలీవుడ్ స్టార్ రామ్. చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఎనర్జిటిక్ హీరో.. నేను శైలజ సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మళయాలి బ్యూటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.

సినిమా రిలీజ్కు ముందు నుంచే హిట్ టాక్తో ఆకట్టుకున్న ఈ సినిమా ఆడియో, రిలీజ్ తరువాత మరింతగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇప్పటికీ చాలా ఫోన్లకు రింగ్ టోన్స్గా వినిపిస్తున్నాయి నేను శైలజ సాంగ్స్. ముఖ్యంగా ప్రేమ పడ్డ యువకుడి మనసు తెలియజేస్తూ రామజోగయ్య శాస్త్రీ రాసిన క్రేజీ క్రేజీ ఫీలింగ్ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్గా మారింది.

నాలుగు నెలల క్రితం క్రేజీ ఫీలింగ్ ఫుల్ వీడియో సాంగ్ కొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ పాటను కోటి మందికి పైగా ఆన్ లైన్ లోచూశారు. ఈ ఆనందాన్ని తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్న హీరో రామ్ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, రచయిత రామజోగయ్య శాస్త్రీ, దర్శకుడు కిశోర్లకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement