కొంచెం ఇష్టం...కొంచెం కష్టం వల్లే: హిమజ | chit chat with Koncham Ishtam Koncham Kashtam actress Himaja | Sakshi
Sakshi News home page

కొంచెం ఇష్టం...కొంచెం కష్టం వల్లే: హిమజ

Published Sat, Jan 14 2017 11:55 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

కొంచెం ఇష్టం...కొంచెం కష్టం వల్లే: హిమజ - Sakshi

కొంచెం ఇష్టం...కొంచెం కష్టం వల్లే: హిమజ

బుల్లితెరలో కెరీర్‌ ప్రారంభించి, ప్రస్తుతం పెద్దతెరలో దూసుకుపోతున్న హిమజ.. అచ్చమైన తెలుగుదనంతో అనతి కాలంలోనే తనకంటూ ఓ ట్రేడ్‌మార్క్‌ని సంపాదించుకుంది. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పొందిన ఆమె... ‘నేను.. శైలజ, శివం, జనతాగ్యారేజ్, ధృవ..’ ఇలా వరుస విజయాలు సాధించిన సినిమాల్లో నటించింది.

సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘శతమానం భవతి’ సినిమాలో పల్లెటూరి కొంటెపిల్లగా ప్రేక్షకులను అలరించింది ఈ అమ్మడు. ఈ చిత్రంలో సుబ్బలక్ష్మి పాత్రలో హార్ట్‌ టచ్చింగ్‌గా నటించింది.   నేపథ్యంలో సంక్రాంతి పండగ, సినిమా విశేషాలను హిమజ ‘సాక్షి’తో పంచుకుంది..    

నేను పుట్టింది విజయవాడలో అయినా, పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. చిన్నప్పటి నుంచి అల్లరి పిల్లగా పెరిగాను. చదువుతోపాటు ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేదాన్ని. నాకు పల్లె‘టూర్‌’ అంటే ఎంతో ఇష్టం. అమ్మమ్మ చేతి వంటలంటే ఇంకా ఇష్టం. ప్రతి సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి స్నేహితులతో కలిసి పతంగులు ఎగిరేస్తూ.. రంగవల్లులు పరిశీలిస్తూ.. అమ్మమ్మ పిండివంటలు ఎంజాయ్‌ చేసేదానిని. పండగకి విడుదలైన కొత్త సినిమాలను వరుసగా మూడు రోజుల్లో మూడు చూసేసి సరదాగా గడిపేవాళ్లం. చెప్పాలంటే నేనొక పెద్ద ఫుడ్డీని. హోమ్‌ ఫుడ్‌నే ఎక్కువగా ఇష్టపడతాను.

నేను ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ మూడేళ్లలో సంక్రాంతిని ఎంజాయ్‌ చేయడం కుదరలేదు. ‘శతమానం భవతి’ సినిమాలో నటించే అవకాశం రావడంతో పల్లెలన్నీ చుట్టేశాను. చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా పండగ వాతావరణాన్ని ఆస్వాదించాను. ఈ సినిమాతో ఒక నిండైన సంక్రాంతి పండగను ఎంజాయ్‌ చేశాను.

నాకు అమ్మానాన్న సపోర్టు చాలా ఉంది. వాళ్ల వల్లే నేను ఈ స్థాయికి వచ్చారు. అలాగే ఇండస్ట్రీలో ఎవరూ తెలిసినవాళ్లు లేకపోయినా స్వశక్తితో పైకి వచ్చాను. ఇక గాసిప్స్‌ అంటే... రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఇవి కూడా అంతే. నా వరకూ నేను ఫర్‌ఫెక్ట్‌గా ఉంటా అని  హిమజ చెప్పుకొచ్చింది.

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్కు చిన్న సినిమాల్లోనే స్కోప్‌ ఉంటుందని, ప్రతి క్యారెక్టర్‌ కు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటించాలని ఉంటుందని, అయితే డేట్స్‌ సమస్య వల్లే నటించలేకపోతున్నట్లు హిమజ తెలిపింది. కొంచెం ఇష్టం...కొంచెం కష్టం సీరియల్‌ తన కెరీయర్‌ కు ప్లస్‌ అయినట్లు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement