పవన్కు నో చెప్పిన హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే స్టార్ హీరోయిన్లు కూడా నో చెప్పారు. అలాంటిది ఓ యంగ్ హీరోయిన్ పవన్ సినిమాలో ఛాన్స్ ఇస్తామంటే సారీ... డేట్స్ ఖాలీల్లేవంటోంది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కీర్తీసురేష్. ఆ సినిమా సక్సెస్తో వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మళయాల ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ తెలుగు, తమిళ భాషల్లో కూడా బిజీ అవుతోంది.
ప్రస్తుతం ఎస్జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్కు జోడిగా కీర్తి సురేష్ అయితే బాగుంటుందని భావించారు. అయితే అదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం రావటంతో పవర్ స్టార్కు నో చెప్పేసింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు ఒకేసారి డేట్స్ అడ్జస్ట్ చేయటం కుదరదన్న ఆలోచనతో పవన్ సినిమాను వదులుకుంది కీర్తీ సురేష్.